ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జనవరి 28న ఎన్ సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి


ర్యాలీ ఇతివృత్తం: 'రాష్ట్రం తొలి ప్రాధాన్యత- కర్తవ్య నిష్ఠ గల యువత'

प्रविष्टि तिथि: 27 JAN 2026 5:47PM by PIB Hyderabad

ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్ లో 28 జనవరి 2026న జరిగే వార్షిక ఎన్ సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
'రాష్ట్రం తొలి ప్రాధాన్యత- కర్తవ్య నిష్ఠ గల యువత' అనే ఇతివృత్తంతో ఈ ఏడాది నిర్వహించే ర్యాలీ.. భారతదేశ యువతలోని కర్తవ్య స్ఫూర్తిని, క్రమశిక్షణను, దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 
దేశవ్యాప్తంగా 898 మంది మహిళా క్యాడెట్లు మొత్తం 2,406 మంది ఎన్ సీసీ క్యాడెట్లతో నెల రోజులుగా నిర్వహించిన ఎన్ సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ 2026, ఈ ప్రధాని ర్యాలీతో ఘనంగా ముగియనుంది. ఈ కార్యక్రమంలో 21 దేశాలకు చెందిన 207 మంది యువతీ యువకులు, అధికారులు పాల్గొంటారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ నిర్మాణం, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసంలో తమ ప్రాధాన్యతను తెలియజేస్తూ.. ఎన్ సీసీ క్యాడెట్లు, రాష్ట్రీయ రంగశాల సభ్యులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు కలిసి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు.


(रिलीज़ आईडी: 2219365) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam , Malayalam