ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా, ఆడపిల్లల గౌరవం, అవకాశాలు, సాధికారత పట్ల ప్రాధాన్యతను తెలియజేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
24 JAN 2026 7:08PM by PIB Hyderabad
గౌరవం, అవకాశం, ఆశలతో ప్రతి ఆడబిడ్డ జీవితం ఉండాలని ప్రభుత్వం సంకల్పించుకున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి స్పష్టం చేశారు.
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఒక సందేశమిచ్చారు. పదేళ్లుగా బాలికల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచటంపై దృష్టి సారించినట్లు చెప్పారు. దీని ఫలితంగా అన్ని రంగాల్లో బాలికలు రాణించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా, ప్రతి ఆడబిడ్డ గౌరవం, అవకాశం, ఆశలతో జీవితాన్ని గడిపేలా చూడాలన్న మా సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాం. పదేళ్లుగా బాలికల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణపై మేం దృష్టి సారించాం. దీనివల్ల ఆడపిల్లలు రాణించేందుకు, వికసిత్ భారత్ కోసం సమర్థవంతంగా సహకారాన్ని అందించేందుకు అవకాశం ఏర్పడింది"
***
(रिलीज़ आईडी: 2218339)
आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam