ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మోహన్ లాల్ మిట్టల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
16 JAN 2026 7:18PM by PIB Hyderabad
శ్రీ మోహన్ లాల్ మిట్టల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.
“ఎక్స్” వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"శ్రీ మోహన్ లాల్ మిట్టల్ గారు పారిశ్రామిక రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి పట్ల చాలా మక్కువ ఉండేది. సామాజిక పురోగతి పట్ల ఆయనకున్న మక్కువను ప్రతిబింబిస్తూ... ఆయన వివిధ దాతృత్వ కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. ఆయన మరణం బాధాకరం. పలుసార్లు మా మధ్య జరిగిన సంభాషణలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం. ఓం శాంతి."
(रिलीज़ आईडी: 2215494)
आगंतुक पटल : 6