హోం మంత్రిత్వ శాఖ
రాజమాత జిజియాబాయి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించాలనే సంకల్పాన్ని, జాతిని రక్షించాలనే గొప్ప లక్ష్యం దిశగా నడిచే స్ఫూర్తిని
ఛత్రపతి శివాజీ మహారాజ్‌లో రగిలించిన రాజమాత జిజియాబాయి
ధైర్యం, స్వాభిమానం, తన సంస్కృతిని రక్షించుకోవాలనే విలువలను చిన్నతనం నుంచే
ఛత్రపతి శివాజీ మహారాజ్‌లో నింపిన రాజమాత జిజియాబాయి
प्रविष्टि तिथि:
12 JAN 2026 11:16AM by PIB Hyderabad
రాజమాత జిజియాబాయి జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు నివాళులు అర్పించారు. హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించాలనే సంకల్పాన్ని, జాతిని రక్షించాలనే గొప్ప స్ఫూర్తిని ఛత్రపతి శివాజీ మహారాజ్‌లో ఆమె రగిలించారు.
‘‘ధైర్యం, ఆత్మగౌరవం, తన సంస్కృతిని పరిరక్షించుకోవాలనే విలువలను చిన్నతనంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్‌లో రాజమాత జిజియాబాయి నింపారు. హిందవీ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని, జాతిని రక్షించాలనే స్ఫూర్తిని శివాజీ మహారాజ్‌లో ఆమె రగిలించారు. రాజమాత జిజియాబాయి జయంతి సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ అమిత్ షా తెలిపారు.
(रिलीज़ आईडी: 2215032)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam