ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తనని తాను తదుపరి తరం ఇంధనంగా భారత బొగ్గు రంగం పునర్నిర్వచించుకొంటోందని చెబుతున్న వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 JAN 2026 4:11PM by PIB Hyderabad

గత 11 సంవత్సరాల్లో భారతదేశ బొగ్గు రంగం తనను తాను తదుపరి తరం ఇంధనంగా ఎలా పునర్నిర్వచించుకొంటోందీ వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ వైపు భారత్ అడుగులు వేయడంలో బొగ్గు రంగం తోడ్పాటును అందిస్తోందనీఈ క్రమంలో హరిత ప్రధాన సాంకేతికతలను కూడా వినియోగించుకుంటున్నదని మంత్రి స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ -
‘‘ 
గత 11 ఏళ్లలో భారత బొగ్గు రంగం తనను తాను తదుపరి తరం ఇంధనంగా ఎలా పునర్నిర్వచించుకున్నదీ తెలియజేస్తూ కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp వివరించారు.. ఇది తప్పక చదవాల్సిన వ్యాసం.
2047 
కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ వైపు భారత్ అడుగులు వేయడంలో బొగ్గు రంగం తోడ్పాటును అందిస్తూనే ఉంటుందనిఈ క్రమంలో హరిత ప్రధాన సాంకేతికతలను కూడా వినియోగించుకుంటుందనీ మంత్రి స్పష్టం చేశారు’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2215028) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam