ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2047 నాటికి వికసిత భారత్ సాధన దిశగా జెన్ జీ యువత శక్తియుక్తులను వెచ్చిస్తున్న తీరుపై ఒక వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 12 JAN 2026 4:27PM by PIB Hyderabad

2047 నాటికి వికసిత భారత్ సాధించే దిశగా దేశ జెన్ జీ యువత తమ శక్తియుక్తులను వెచ్చిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు. ‘‘స్వచ్ఛ భారత్హర్ ఘర్ తిరంగామేరీ మాటీ మేరా దేశ్నషా ముక్త్ భారత్ వంటి ప్రధాన కార్యక్రమాలను దేశ యువత ముందుండి నడిపిస్తున్నట్లు ఆయన స్పష్టంగా వివరించారు’’ అని శ్రీ మోదీ చెప్పారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి చేసిన పోస్టుపై స్పందిస్తూ.. శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘2047 నాటికి వికసిత భారత సాధన దిశగా దేశం సమష్టిగా కృషి చేస్తున్న తరుణంలో.. తమ శక్తియుక్తులను దేశ హితం కోసం వెచ్చిస్తున్న భారత జెన్జీ యువత గురించి కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp రాశారు.

స్వచ్ఛ భారత్హర్ ఘర్ తిరంగామేరీ మాటీ మేరీ దేశ్నషా ముక్త్ భారత్ వంటి ప్రధాన కార్యక్రమాలను దేశ యువత ముందుండి నడిపి వాటికి ఓ రూపునిచ్చిన తీరును ఆయన ఈ వ్యాసంలో స్పష్టంగా వివరించారు.’’  


(रिलीज़ आईडी: 2215027) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Marathi , Tamil , Odia , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada