ప్రధాన మంత్రి కార్యాలయం
ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించే సమగ్ర పాలనను ప్రతిబింబించేలా రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ 2025 గురించి రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
30 DEC 2025 1:16PM by PIB Hyderabad
రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ 2025 గురించి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ఒక్కొక్కటిగా సమస్యలను నిశ్శబ్దంగా పరిష్కరించే సమగ్ర పాలన గురించి ఇది వివరిస్తుంది.
విస్తృత స్థాయిలో చేపట్టిన సంస్కరణల గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. కార్మిక చట్టాలు, వాణిజ్య ఒప్పందాల నుంచి సరకు రవాణా, ఇంధనం, మార్కెట్ సంస్కరణల వరకూ.. విశ్వసనీయత, స్థిరత్వం, దీర్ఘకాల విశ్వాసంపై భారత అభివృద్ధి కథనం నిర్మితమైందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ చేసిన పోస్టుకు స్పందిస్తూ.. పీఎంవో ఇండియా ఇలా పేర్కొంది:
‘‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ 2025 గురించి కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ రాశారు. ఒకదాని తర్వాత ఒకటిగా నిశ్శబ్దంగా సమస్యలను పరిష్కరించే సమగ్ర పాలన గురించి ఆయన వివరించారు.
కార్మిక చట్టాలు, వాణిజ్య ఒప్పందాల నుంచి సరకు రవాణా, ఇంధనం, మార్కెట్ సంస్కరణల వరకూ.. విశ్వసనీయత, స్థిరత్వం, దీర్ఘకాల విశ్వాసంపై భారత అభివృద్ధి గాథ నిర్మితమైంది.’’
(రిలీజ్ ఐడి: 2209809)
సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam