ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రిస్మస్ సందర్భంగా ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 DEC 2025 10:43AM by PIB Hyderabad

క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని 'ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్'లో ఇవాళ ఉదయం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. "ప్రేమశాంతికరుణ సందేశాలను ఈ ప్రార్థనా కార్యక్రమం ప్రతిబింబించిందిక్రిస్మస్ పండగ స్ఫూర్తితో సమాజంలో సామరస్యంసద్భావన పెంపొందాలని కోరుకుంటున్నానుఅని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని 'ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్'లో జరిగిన ఉదయపు ఆరాధనా కార్యక్రమానికి హాజరయ్యానుఈ వేడుక ప్రేమశాంతికరుణ సందేశాలను చాటి చెప్పిందిక్రిస్మస్ పండగ స్ఫూర్తితో సమాజంలో సామరస్యంసద్భావన పెంపొందాలని ఆకాంక్షిస్తున్నాను"

"ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో జరిగిన ప్రార్థనలకు సంబంధించిన దృశ్యాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి"

ఈ క్రిస్మస్ మీకు ఎనలేని కొత్త ఆశఆప్యాయతకరుణను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

"ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో జరిగిన ఉదయపు ప్రార్థనలకు సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉన్నాయి"

 


(रिलीज़ आईडी: 2208427) आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam