హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విజయ్ దివస్ సందర్భంగా యుద్ధంలో ప్రాణత్యాగం చేసి అమరులైన వీరులకు నివాళి అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


1971లో ఇదే రోజున భద్రతా దళాలు అజేయ ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూ, నిర్దిష్ట వ్యూహాన్ని అమలు చేసి

పాకిస్తానీ సైన్యాన్ని ఓడించి లొంగిపోయేలా చేశారు…


ఈ విజయం అన్యాయాన్నీ, అణచివేతనీ ఎదురొడ్డి నిలిచిన ఒక కవచం..

ఇది ప్రపంచమంతటా మానవజాతిని రక్షించిన ఒక ఆదర్శ ఉదాహరణని అందించింది..

సాటి లేని సత్తానీ, పరాక్రమాన్నీ భారత సేన చాటిచెప్పింది...

నాడు పోస్టు చేయడమైనది: 16 DEC 2025 10:29AM by PIB Hyderabad

విజయ్ దివస్ సందర్భంగా.. యుద్ధంలో ప్రాణత్యాగం చేసి అమరులైన వీరులకు కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు.
భద్రతా దళాలు 1971వ సంవత్సరంలో ఇదే రోజునఅజేయ ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూనిర్దిష్ట వ్యూహాన్ని అమలు చేసి పాకిస్తానీ సైన్యాన్ని ఓడించిలొంగిపోక తప్పని స్థితిని కల్పించాయని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశంలో పేర్కొన్నారుఈ విజయం అన్యాయాన్నీఅణచివేతనీ ఎదురొడ్డి నిలిచిన ఓ కవచంగా ఉండి ప్రపంచస్థాయిలో మానవత్వాన్ని రక్షించిన ఆదర్శ ఉదాహరణని అందించిందనీభారతీయ సేనల సాటి లేని సత్తానీపరాక్రమాన్నీ చాటిచెప్పిందనీ శ్రీ షా ప్రశంసించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2204519) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam