ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశ సాంస్కృతిక వైభవం, ఈశాన్య ప్రాంతంలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక హార్న్‌బిల్ ఉత్సవం... ఓ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 14 DEC 2025 11:32AM by PIB Hyderabad

నాగాలాండ్‌లోని హార్న్‌బిల్ ఉత్సవానికి ఉన్న సజీవ స్ఫూర్తిని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారుభారతదేశ సాంస్కృతిక సంపదగిరిజన వారసత్వానికి సంబంధించిన శాశ్వత చైతన్యానికి శక్తిమంతమైన ప్రతిబింబంగా ఈ ఉత్సవాన్ని ఆయన వర్ణించారు

ఈ రోజు కొత్తఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశానికి ఈశాన్య ప్రాంతం ముఖచిత్రంగా ఉందని ప్రధాని ప్రస్తావించారునాగాలాండ్‌ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును ఆయన కొనియాడారుఈ రాష్ట్రం కేవలం ఒక ఉత్సవాన్ని మాత్రమే నిర్వహించడం లేదనిగర్వకారణమైన ‘ఉత్సవాల నేల’ అనే బిరుదును నిజంగా సార్థకం చేసుకుంటూ ఉత్సవాలకు ప్రతిరూపంగా మారుతోందని అన్నారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా చేసిన ఒక పోస్ట్‌పై స్పందిస్తూ ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

ఈ ఆసక్తికరమైన వ్యాసంలో కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా…నాగాలాండ్‌లోని హార్న్‌బిల్ ఉత్సవాన్ని మానవ స్ఫూర్తి వర్ణపటంప్రాచీనంసమకాలీన అంశాల అద్భుతమైన కలయికగా వర్ణించారుఈశాన్య ప్రాంతం వెలుగులీనుతున్నప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పునరుద్ఘాటించారు

కొత్తఆత్మవిశ్వాసంతో కూడిన భారత్‌కు ఈశాన్య ప్రాంతాన్ని ప్రతిబింబంగా పేర్కొన్న కేంద్ర మంత్రి నాగాలాండ్ కేవలం ఉత్సవాన్ని నిర్వహించటం మాత్రమే కాకుండా గర్వకారణమైన ‘ఉత్సవాల నేల’ అనే బిరుదును నిజంగా సార్థకం చేసుకుంటూ ఉత్సవాలకు ప్రతిరూపంగా మారుతోందని పేర్కొన్నారు”

 

***


(रिलीज़ आईडी: 2204167) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam