ప్రధాన మంత్రి కార్యాలయం
ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్-2025లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత పురుషుల జూనియర్ హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 DEC 2025 9:49PM by PIB Hyderabad
ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్-2025లో భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు చరిత్ర సృష్టించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆటల పోటీలో భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని అందించిన ఉత్సాహవంతులైన యువ జట్టును ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ అసాధారణ విజయం భారత యువత లోని ప్రతిభనీ, సంకల్పాన్నీ, దృఢత్వాన్నీ చాటిచెప్పిందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్-2025లో చరిత్రను సృష్టించినందుకు మన పురుషుల జూనియర్ హాకీ జట్టుకు అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక ఆటల పోటీలో యువకులు, ఉత్సాహవంతులతో కూడిన మన జట్టు దేశానికి ప్రప్రథమ కాంస్య పతకాన్ని అందించింది. ఈ అద్భుత విజయం దేశవ్యాప్తంగా ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిని అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2202833)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
Bengali
,
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Odia