హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక చర్చను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


· స్వతంత్రోద్యమ సమయంలో దేశభక్తిని ప్రేరేపించిన వందేమాతరం: నేటికీ అదే స్ఫూర్తి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత నిర్మాణం దిశగా చోదకశక్తిగానూ వందేమాతరం

· దేశభక్తి, అంకితభావం, కర్తవ్య నిష్టలను మేల్కొల్పిన చిరస్మరణీయ సృజన వందేమాతరం

· ‘వందేమాతరం’ వైశిష్ట్యం భావి తరాలకు తెలిసేలా ఈ చర్చ... దేశ పునర్నిర్మాణానికి ఇది పునాది రాయి

· నాటి ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు వందేమాతరాన్ని విభజించి బుజ్జగింపు రాజకీయాలు చేయకపోయి ఉంటే, దేశ విభజన జరిగి ఉండేది కాదు

· ‘పవిత్రాత్మ నుంచి వచ్చిన గేయం’గా గాంధీ అభివర్ణించిన వందేమాతరాన్ని రెండు భాగాలుగా విడగొట్టిన నాటి ప్రధాన రాజకీయ పార్టీ

· వందేమాతరానికి వందేళ్లు నిండిన వేళ.. వందేమాతరమని నినదించిన వారిని జైలుపాలు చేసి, ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని

· గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతర గేయాలాపనతో సమావేశాలను మొదలుపెట్టిన చరిత్ర నేటి ప్రతిపక్షానిది... నేడు లోకసభలో చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీతో అనుబంధమున్న ఉన్నత కుటుంబీకులు ఇప్పుడు సభలోనే లేరు

· స్వాతంత్ర్య పోరాటం నాటి నుంచే వందేమాతరంపై నరనరాల్లో అగౌరవం, అమర్యాద పేరుకుపోయిన ప్రధాన ప్రతిపక్షం.. నేటికీ అదే ధోరణి

· ఇస్లామిక్, బ్రిటిష్ దండయాత్రలతో మన సంస్కృతి, చరిత్రలు ధ్వంసమై బలహీనపడిన వేళ.. వందేమాతరాన్ని రాసి సాంస్కృతిక జాతీయవాదాన్ని పునరుద్ధరించిన బంకించంద్ర చటోపాధ్యాయ

· నేటికీ అత్యంత శక్తిమంతమైన స్వేచ్ఛా, సాంస్కృతిక, దేశభక్తి నినాదంగా వందేమాతరం

· నాడు స్వతంత్ర నినాదంగా వందేమాతరం.. నేడు అభివృద్ధి చెందిన, గొప్ప భారత్ నిర్మాణం దిశగా స్ఫూర్తిదాయక మంత్రమూ అదే

· వందేమాతర విజయనాదంతోపాటే.. ప్రతి బిడ్డ, యువత మనస్సుల్లో, హృదయాల్లో దేశభక్తి, త్యాగనిరతి పాదుకునేలా చేయడం మనందరి కర్తవ్యం

प्रविष्टि तिथि: 09 DEC 2025 6:54PM by PIB Hyderabad

జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా రాజ్యసభలో ప్రత్యేక చర్చను ప్రారంభించారు.

వందేమాతరం గురించి చర్చించాల్సినదాని పట్ల గౌరవభావాన్ని చాటాల్సిన ఆవశ్యకతను కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా వివరించారు. ఈ గేయాన్ని మొదట రచించిన నాటి ప్రత్యేకంగా అస్తిత్వాన్ని చాటుకుంటోంది. స్వాతంత్రోద్యమానికి ముందుకు నడిపింది. నేటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోంది. అలాగే భారత్ నిజంగా గొప్ప దేశంగా ఆవిర్భవించే 2047లోనూ నిలిచి ఉంటుంది. భరతమాత సేవపై అంకితభావంఆమెపై భక్తి భావనకర్తవ్య నిష్టలను జాగరూకం చేసే చిరస్మరణీయ సృజన వందేమాతరం. పశ్చిమ బెంగాల్‌లో జరగబోతున్న ఎన్నికలతో దీనిని ముడిపెట్టడం ద్వారా వందేమాతరం కీర్తిని తక్కువ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వందేమాతరం ఎప్పుడూ పశ్చిమ బెంగాలుకోభారత్‌కో మాత్రమే పరిమితం కాలేదనీస్వాతంత్ర్యాన్ని ప్రేమించేవారు ప్రపంచంలో ఎక్కడున్నా.. వారు తమ రహస్య సమావేశాల్లోనూ వందేమాతరాన్ని ఆలపించేవారని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ రోజుకూ దేశం కోసం ప్రాణమిచ్చేందుకు వెనుకాడని సరిహద్దులో సైనికుడైనాఅంతర్గత భద్రత విధుల్లో ఉన్న పోలీసు జవానయినా.. వందేమాతరమే వారికి మంత్రప్రదం.

వందేమాతరం గేయం స్వాతంత్య్ర ప్రకటనగాస్వతంత్రోద్యమానికి ప్రేరణగాభరతమాతను బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి చేసిన శక్తిగా మారిందని శ్రీ అమిత్ షా అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భారత అమరవీరులు.. పునర్జన్మను పొంది, అప్పుడు కూడా భరతమాత కోసమే జీవితాన్ని సమర్పించేలా ప్రేరేపించేది వందేమాతరమే అన్నారు. ఎందరో ఆలోచనాపరులురుషులు వందేమాతరం నుంచి స్ఫూర్తిని పొంది.. అత్యంత ప్రాచీన చరిత్ర ఉన్న ఈ దేశాన్ని చిరతరమైన దాని సాంస్కృతిక మార్గంలో శతాబ్దాలుగా నడిపిస్తున్నారు. పార్లమెంటు ఉభయసభల్లో వందేమాతరంపై చర్చిస్తున్నాందాన్ని శ్లాఘిస్తున్నాం. మన పిల్లలు, యువతభావి తరాలు వందేమాతర ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుని.. దేశ పునరుజ్జీవంపునర్నిర్మాణానికి పునాదులు వేసేలా ఈ వేడుక సహాయపడుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.

బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతర గేయం మొదటిసారిగా 1875 నవంబరు 7న ప్రజల్లోకి వచ్చిందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. అనతికాలంలోనే దేశభక్తికీత్యాగనిరతికీజాతీయతా చేతనకు ప్రతీకగా వందేమాతరం ఆవిర్భవించిందన్నారు. మన స్వాతంత్ర్యోద్యమానికి ఇది మార్గం సుగమం చేసిందన్నారు. వందేమాతర రచన జరిగిన నేపథ్యాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలన్నారు. దేశ సంస్కృతినీచరిత్రనూ ధ్వంసం చేసిన శతాబ్దాల ఇస్లామిక్ దండయాత్రలుఅనంతరం కొత్త నాగరికతనూ సంస్కృతినీ మనపై రుద్దేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ పరిపాలనల నేపథ్యంలో వందేమాతర సృజన జరిగిందని ఆయన వివరించారు. అలాంటి సమయంలో బంకిం బాబు వందేమాతరాన్ని రచించారని కొనియాడారు. మన ప్రాచీన నాగరికతనుసాంస్కృతిక జాతీయవాద భావననుమాతృభూమిని దేవతగా పూజించే మన చిరతర సంప్రదాయాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ చాలా సూక్ష్మంగా పునరుద్ధరించినిలబెట్టారని శ్రీ అమిత్ షా అన్నారు. నాటి ప్రభుత్వం దాన్ని అణచివేయడానికి యత్నించింది. వందేమాతర గానంపై నిషేధాలు విధించింది. వందేమాతరమని నినదించిన వారిని హింసించి జైలులో పెట్టింది. అయినప్పటికీ ఈ నిషేధాలన్నింటినీ అధిగమించిఎలాంటి వ్యవస్థీకృత ప్రచారమూ లేకుండా.. ఆ గేయం ప్రతి హృదయాన్నీ తాకింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించింది. భారత సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరికీ వందేమాతరం పునరుజ్జీవనోద్యమ మంత్రంగా మారిందని ఆయన అన్నారు.

దేశం వలస పాలనలో మగ్గిపోతున్న సమయంలో అనేక ఆలయాలువిశ్వవిద్యాలయాలుకళా కేంద్రాలువ్యవసాయంవిద్యావ్యవస్థలు ధ్వంసమయ్యాయనీకానీ ప్రజల మనస్సుల్లోంచి మన సాంస్కృతిక అస్తిత్వాన్ని ఎవరూ తుడిచిపెట్టలేకపోయారనీ శ్రీ అమిత్ షా అన్నారు. ఆ సమయంలో ఆ స్ఫూర్తిని జాగరూకం చేసిపునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందనీసరిగ్గా అప్పుడే బంకిం బాబు వందేమాతరం రచించారని చెప్పారు. బ్రిటిష్ వారు గానీవారి నాగరికతను అంగీకరించిన వారు గానీ దానిని ఆపలేకపోయారు. స్వీయ దైవిక శక్తిని మరచిన జాతిని వందేమాతరం మేల్కొలిపిందని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరం దేశ ఆత్మను పునరుజ్జీవింపజేసింది. వందేమాతరాన్ని భారతదేశ పునరుజ్జీవన మంత్రంగా మహర్షి అరబిందో అభివర్ణించారు. వందేమాతరం ఘనతను ఈ ప్రకటన ప్రతిబింబిస్తుంది. వందేమాతరంపై శ్రీ అరబిందుడి ఆత్మీయ భావన ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకంగాస్వతంత్రతా మంత్రంగా మారిందని శ్రీ అమిత్ షా అన్నారు.

మొత్తం ప్రపంచంలో మన దేశం ప్రత్యేకమైందని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి అన్నారు. సంస్కృతే సరిహద్దులను నిర్దేశించే ఏకైక దేశం భారత్ అనిఆ సంస్కృతే భారత్‌ను కలిపి ఉంచిందని అన్నారు. వలస పాలన కాలంలో సాంస్కృతిక జాతీయవాద భావనను మేల్కొల్పింది బంకించంద్ర చటోపాధ్యాయ. మన దేశాన్ని ఏకతాటిపై నిలిపే మంత్రం మన సంస్కృతి అనిసాంస్కృతిక జాతీయవాద సూత్రాన్ని మొదటిసారి దృఢంగా చాటిన విజయనాదం వందేమాతరమని ఆయన వ్యాఖ్యానించారు. నేడు దేశం మొత్తం సాంస్కృతిక జాతీయవాద భావనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని శ్రీ అమిత్ షా అన్నారు. భారత్ మనకు కేవలం ఒక భూభాగం మాత్రమే కాదనీ.. అది మాతృ స్వరూపమనిఆమెను భక్తితో స్తుతిస్తామని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వందేమాతరమంటే కచ్చితంగా భక్తిని ఆ విధంగా వ్యక్తీకరించడమే. వందేమాతరం కూర్పులో భరతమాత భావనను అమితమైన భావోద్వేగాలతో వర్ణించారు. నీటినిపండ్లనుసంపదను ప్రసాదించే దేవతగా ఆమెను చిత్రీకరించారు. పుష్పాలంకృతగాహృదయానికీ మనస్సుకూ ఆహ్లాదాన్ని ప్రసాదించే ఆమెను సరస్వతిలక్ష్మిదుర్గా స్వరూపంగా వందేమాతర గేయం వర్ణించింది. మొత్తంగా భరతమాత కృపఆరాధన వల్లే మనం శ్రేయస్సుభద్రతజ్ఞానంపురోగతులను సాధించగలమని ఆయన అన్నారు. భరతమాతఈ పవిత్ర క్షేత్రాల కృప వల్లే... దుర్గమ్మ శౌర్యంలక్ష్మీ సమృద్ధిసరస్వతీ మేధలను మనం పొందగలమనీ.. అందుకే ఆమెకు మనం పదేపదే భక్తితో నమస్కరించాలని అన్నారు.

నాగరిక జీవన విధానానికి ప్రాతిపదికలైన మన అస్తిత్వాన్నీ, భాషనూ అందించి.. మన జీవితాలను ఉన్నతీకరించుకునే అవకాశాన్ని మాతృభూమి మనకిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. మాతృభూమి కన్నా గొప్పది ఏదీ లేదని, చిరతరమైన ఈ భావనను బంకించంద్ర చటర్జీ పునరుజ్జీవింపజేశారని ఆయన అన్నారు. వలస పాలన చీకటి యుగంలో వందేమాతరం కాంతిపుంజమై వెలుగులు ప్రసరించింది. ప్రజలు బానిస మనస్తత్వాన్ని విడనాడేలా చేసి, స్వరాజ్య సాధన స్ఫూర్తిని వారిలో రగిలించింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో.. మన సమరయోధులు అమరులవుతూ చివరిగా నినదించినదీ ‘వందేమాతర’మే. 1907లో మహర్షి అరబిందో సంపాదకత్వంలో కలకత్తాలో వందేమాతరం అనే ఆంగ్ల వార్తాపత్రిక ప్రారంభమైందన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం దానిని అత్యంత ప్రమాదకరమైన జాతీయవాద పత్రికగా పరిగణించిశ్రీ అరబిందోపై దేశద్రోహం అభియోగం మోపిఆయనకు శిక్ష విధించింది.

1896లో గురుదేవులు ఠాగూర్ తొలిసారిగా కాంగ్రెస్ సమావేశంలో బహిరంగంగా వందేమాతరం పాడారని, 1905లో వారణాసి సమావేశంలో మహా కవయిత్రి సరళాదేవి చౌధురాణి సంపూర్ణ వందేమాతరాన్ని ఆలపించారని కేంద్ర హోం మంత్రి తెలిపారు. 1947 ఆగస్టు 15న ఉదయం 6:30 గంటలకు దేశం స్వతంత్రమైన వేళ.. సర్దార్ పటేల్ అభ్యర్థన మేరకు పండిట్ ఓంకార్‌నాథ్ ఠాకూర్ తన మధుర స్వరంతో ఆలిండియా రేడియోలో వందేమాతరాన్ని ఆలపించారు. ఇది యావద్దేశాన్ని కదిలించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో.. జాతీయ గీతంతో సమాన గౌరవాన్నిస్తూ జాతీయ గేయంగా వందేమాతరాన్ని ప్రకటించారని శ్రీ అమిత్ షా తెలిపారు.

వందేమాతరంపై చర్చలను తప్పించుకునే ధోరణి కొత్తదేమీ కాదని శ్రీ అమిత్ షా అన్నారు. 1925లో వందేమాతర స్వర్ణోత్సవ వేళ.. నాటి ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు వందేమాతరాన్ని చీల్చేసి బుజ్జగింపులు మొదలుపెట్టి ఉండకపోతే దేశ విభజన జరిగేది కాదన్నారు. 50వ వార్షికోత్సవ సమయంలోనే వందేమాతరంపై పరిమితులను విధించి సంతుష్టీకరణ రాజకీయాలు మొదలుపెట్టారని, అంతిమంగా అది దేశ విభజనకు దారితీసిందని విమర్శించారు. బుజ్జగింపు విధానాలతో వందేమాతరాన్ని రెండు భాగాలుగా విభజించి ఉండకపోతే.. దేశం విడిపోయి ఉండేది కాదన్నారు. వందేమాతరానికి వందేళ్లు నిండిన వేళ.. ఆ నినాదం చేసిన వారందరినీ నాటి ప్రధాని జైలుపాలు చేశారని శ్రీ అమిత్ షా చెప్పారు. ఆ కాలంలో దేశంలో ఎమర్జెన్సీ విధించారనీ.. లక్షలాది ప్రతిపక్ష సభ్యులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో వార్త పత్రికల కార్యాలయాలకు ఏ కారణమూ లేకుండానే తాళాలు వేశారని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆలిండియా రేడియోలో కిషోర్ కుమార్ స్వరాన్ని వినిపంచేందుకు కూడా అనుమతించలేదని, లతాజీ గాత్రంలో యుగళగీతాలను మాత్రమే ప్రసారం చేశారని విమర్శించారు. వందేమాతరానికి వందేళ్లు నిండిన సమయంలో నిజానికి దేశం మొత్తం బంధీగా ఉందన్నారు. గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతర గేయాలాపనతో సమావేశాలను మొదలుపెట్టిన చరిత్ర నేటి ప్రతిపక్షానికి ఉందని, అయితే అదే వందేమాతరంపై ఈ రోజు లోకసభలో చర్చిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య కుటుంబీకులంతా గైర్హాజరయ్యారని శ్రీ అమిత్ షా విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షానికి స్వాతంత్ర్య పోరాటం నాటి నుంచి వందేమాతరం పట్ల నరనరాల్లో అమర్యాద, అగౌరవం పేరుకుపోయిందన్న ఆయన.. నేటికీ అదే ధోరణి కొనసాగుతోందన్నారు.

వందేమాతరం గురించి నేడు చర్చించాల్సిన అవసరం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోకసభలో చెప్పారని కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి విమర్శించారు. దేశ ఆత్మతో ముడిపడి ఉందని మహాత్మాగాంధీ అభివర్ణించిన.. ‘రాష్ట్రధర్మ’లో దేశభక్తినీ, కర్తవ్య నిష్టనూ సమగ్రంగా వ్యక్తీకరించిందని బిపిన్ చంద్రపాల్ కొనియాడిన ఈ గేయాన్ని కూడా నేటి ప్రతిపక్షమే విడగొట్టింది. మన స్వాతంత్ర్యోద్యమాన్ని ఉత్తేజితం చేసేలా.. అంతర్జాతీయ స్థాయిలోనూ వందేమాతరం కీలక పాత్ర పోషించిందని శ్రీ అమిత్ షా అన్నారు. వలస పాలన కాలంలో కూడా 1936 నాటి బెర్లిన్ ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు అమితమైన భావోద్వేగంతో వందేమాతరాన్ని ఆలపించి, బంగారు పతకాని సాధించిందని శ్రీ అమిత్ షా చెప్పారు.

సాంస్కృతిక జాతీయవాద భావనే తమ పార్టీకి ప్రాతిపదిక అని కేంద్ర హోం మంత్రి చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి ప్రాతిపదికన కాకుండా.. స్వీయ సంస్కృతి, మౌలిక భావనలు దేశ కార్యాచరణకు ఆధారంగా ఉండాలన్న ఆలోచనతోనే తమ పార్టీ ఏర్పడిందని వివరించారు.

ఈ పార్లమెంటులో వందేమాతర గానాన్ని నిలిపేసిన విషయం రికార్డుల్లోనే ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. 1992లో ఎంపీ శ్రీ రామ్ నాయక్ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తి, పార్లమెంటులో వందేమాతరం పాడాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సభ ఆమోదం పొందిన వందేమాతర గేయాన్ని ఈ అత్యున్నత సభలో పాడాల్సిందేనని ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న శ్రీ లాల్ కృష్ణ అద్వానీ లోకసభ స్పీకర్‌కు గట్టిగా చెప్పారు. అప్పుడే ఏకగ్రీవ అంగీకారంతో 1992లో వందేమాతర గేయాలాపన లోకసభలో తిరిగి ప్రారంభమైంది.

వందేమాతరం గేయాలాపనను మొదలుపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్ష కూటమిలోని చాలా మంది సభ్యులు వందేమాతరం పాడబోమని చెప్పినట్టు కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి తెలిపారు. వందేమాతర గానం మొదలవడానికి ముందు సభలో కూర్చుని ఉన్న కొంతమంది సభ్యులు.. గేయం మొదలవగానే లేచి నిలబడి బయటకు వెళ్లిపోవడాన్ని తాను గమనించానని కేంద్ర హోం మంత్రి చెప్పారు. అయితే, వందేమాతర గేయాలాపన సమయంలో లేచి నిలబడకుండా ఉన్న సభ్యుడు తమ పార్టీలో ఒక్కడు కూడా లేరని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.

బంకించంద్ర చటోపాధ్యాయ 130వ వర్ధంతి సందర్భంగాతపాలా శాఖ ద్వారా ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసిందని, 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. జాతీయ జెండాను ఎగరేసే సమయంలో వందేమాతరమని నినదించడం మరవొద్దని నాడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరిన విషయాన్ని శ్రీ అమిత్ షా గుర్తు చేశారు.

వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం కూడా నిర్ణయించిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. రాబోయే ఏడాదంతా వందేమాతరానికి స్మారకంగా జరుపుకోవాలని నిర్ణయిస్తూ.. 2025 అక్టోబరు 1న కేబినెట్ తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. 2025 అక్టోబరు 24న జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమన్వయ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాయి. 2025 నవంబర్ 7న న్యూఢిల్లీలో భరతమాతకు పుష్పాంజటి ఘటించి ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని శ్రీ అమిత్ షా తెలిపారు. దీని మొదటి దశ నవంబరులో పూర్తవగా.. 2026 జనవరిలో రెండో దశ, 2026 ఆగస్టులో మూడో దశ, 2026 నవంబరులో నాలుగో దశ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. స్మారక తపాలా స్టాంపునూ, నాణేన్నీ కూడా విడుదల చేసినట్టు కేంద్ర హోం మంత్రి తెలిపారు.

వందేమాతరం – నాద్ ఏకం రూప్ ఆనేకం’ పేరుతో 75 మంది సంగీతకారులు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనకు రూపకల్పన చేశారనికేంద్ర ప్రభుత్వ పిలుపుతో నవంబరు 7న దేశవ్యాప్తంగా ప్రజలు సమష్టిగా వందేమాతరాన్ని ఆలపించారని శ్రీ అమిత్ షా తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక డాక్యుమెంటరీని రూపొందించినట్టు ఆయన తెలిపారు. ప్రతి జిల్లాలో, తహసీల్‌లో వందేమాతరంపై ప్రదర్శనలను కూడా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, కోట్లాది ప్రజలు ఈ ప్రదర్శనను డిజిటల్‌గా వీక్షిస్తారు.

ఆలిండియా రేడియో, దూరదర్శన్, ఎఫ్ఎం రేడియో చానళ్లలో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) చర్చలు, సమావేశాలను నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. అన్ని భారత రాయబార కార్యాలయాల్లో వందేమాతరం ఆధారంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘వందేమాతరం: మాతృభూమికి వందనం’ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. దేశభక్తిని ప్రేరేపించే కుడ్యచిత్రాలను, వందేమాతర చరిత్ర తాలూకు వర్ణనలను కూడా హైవేల వెంట ప్రదర్శిస్తారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఎల్ఈడీ డిస్‌ప్లేల ద్వారా బహిరంగ ప్రకటనలు చేస్తారు. అంతేకాకుండా వందేమాతరంబంకించంద్ర చటోపాధ్యాయ జీవితం ఆధారంగా 25 లఘుచిత్రాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన వేళ.. అది కోవిడ్ సమయమే అయినప్పటికీ, రెండేళ్లపాటు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహించినట్టు శ్రీ అమిత్ షా తెలిపారు. 1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్ర్య పోరాట వీరగాథను ఈ అమృత్ మహోత్సవ్ ద్వారా దేశ యువతకు పరిచయం చేశాం. చరిత్రలో పేర్లు కూడా నమోదు కాని స్వాతంత్ర్యోద్యమ విస్మృత వీరులెందరినో గుర్తించి.. వారి వివరాలను నమోదు చేశామని, వారి గౌరవార్థం స్మారక చిహ్నాలను నిర్మించామనిదేశవ్యాప్తంగా లెక్కలేనన్ని కార్యక్రమాలను నిర్వహించామని, దేశభక్తి నవ తరంగం ఉవ్వెత్తున ఎగిసేలా సమష్టిగా కృషి చేశామని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యానంతరం మొదటిసారిగా ఇంత విస్తృతమైన కార్యక్రమాలను నిర్వహించామన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం దేశాన్ని చాలా ముందుకు నడిపించిందని కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి అన్నారు. మనం మన ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో బలోపేతం చేసుకున్నామని, నేడు మన ప్రజాస్వామ్య మూలాలు చాలా బలంగా మారాయని అన్నారు. స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఉన్న సమయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమృత్ కాల్’గా పేరు పెట్టారని శ్రీ అమిత్ షా తెలిపారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నుంచి స్వాతంత్ర్య శతాబ్ది వరకు కాలాన్ని సవాళ్ల దశగా పరిగణించాలన్న సంకల్పాన్ని ప్రధానమంత్రి దేశ యువతకు అందించారు. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి మన దేశం ప్రతి రంగంలోనూ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది. ఇది కేవలం ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమో, లేదా ఓ రాజకీయ పార్టీ సంకల్పమో కాదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది దీనిని కేవలం రాజకీయ నినాదంగా కొట్టిపారేయవచ్చన్న ఆయన.. నిజంగా ఇది 140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పమనిచ్చితంగా నెరవేరుతుందని స్పష్టం చేశారు. మనం ‘అమృత కాల్’ను ఆచరిస్తున్న సమయంలోనే వందేమాతర 150 వార్షికోత్సవం రావడం దైవిక సంకల్పమేనని హోం మంత్రి అన్నారు. ఈ కీలక సమయంలో.. మరోసారి దేశభక్తిని జ్వాలను రగిలిద్దామని కోరారు.

వందేమాతరం ఎన్నటికీ ఔచిత్యాన్ని కోల్పోదని శ్రీ అమిత్ షా అన్నారు. ఆ గేయాన్ని రచించిన సమయంలో దాని ఆవశ్యకత ఎంత ఉందో, నేటికీ అంతే ఉంది. ఆ సమయంలో దేశానికి విముక్తిని ప్రసాదించే చోదక శక్తిగా వందేమాతరం నిలిచిందన్న ఆయన.. ఈ అమృతకాలంలో అది భారత్‌ను అభివృద్ధి చెందిన, గొప్ప దేశంగా తీర్చిదిద్దే విజయనాదంగా మారిందన్నారు.

ఈ దేశపు ప్రతీ బిడ్డ మదిలో మరోసారి వందేమాతర స్ఫూర్తిని మేల్కొలపడం, కౌమార బాలల మనస్సుల్లో వందేమాతర నినాదం వేళ్లూనుకునేలా చేయడం, వందేమాతర నిజమైన సారాన్ని అందిపుచ్చుకుని ఉజ్వలమైన మార్గంలో నడిచేలా దేశ యువతలో స్ఫూర్తిని నింపడం... ఈ సభలోని సభ్యులందరి సమష్టి బాధ్యత అని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. మన స్వాతంత్ర్య సమరయోధులు కలగన్న భారత్ నిర్మాణం దిశగా వందేమాతర నాదం చోదక శక్తిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.


(रिलीज़ आईडी: 2201712) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam