ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యునెస్కో అమూర్త వారసత్వ జాబితాలో దీపావళిని చేర్చడాన్ని స్వాగతించిన ప్రధాని

మన సంస్కృతి, ఆచారాలతో దీపావళికి సన్నిహిత సంబంధముంది.. ఇది మన నాగరికతకు ఆత్మ

ఇది వెలుగుల పండుగ.. ధార్మికత మూర్తీభవిస్తే అది దీపావళి: ప్రధాని

प्रविष्टि तिथि: 10 DEC 2025 12:20PM by PIB Hyderabad

యునెస్కో అమూర్త వారసత్వ జాబితాలో దీపావళిని చేర్చడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది మనకు గర్వకారణమన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో యునెస్కో చేసిన ఓ పోస్టుపై శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ప్రజలు పులకరింతకు లోనైన క్షణమిది.

దీపావళికి మన సంస్కృతితో, ఆచారాలతో అత్యంత సన్నిహిత సంబంధముంది. ఇది మన నాగరికతకు ఆత్మ. ఇది వెలుగుల పండుగ. ధార్మికత మూర్తీభవిస్తే అది దీపావళి. యునెస్కో అమూర్త వారసత్వ జాబితాలో దీపావళిని చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగకు ప్రజాదరణను మరింతగా పెంచేలా దోహదపడుతుంది.

శ్రీరామచంద్రుడి ఆదర్శాలు మనకెన్నటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయి.

@UNESCO”


(रिलीज़ आईडी: 2201493) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam