ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ లిప్-బు టాన్‌తో సమావేశమైన ప్రధానమంత్రి, భారత్ సెమీకండక్టర్ ప్రయాణంపై ఇంటెల్ సంస్థ నిబద్ధతపై ప్రశంసలు
प्रविष्टि तिथि:
09 DEC 2025 9:11PM by PIB Hyderabad
శ్రీ లిప్-బు టాన్‌తో నేడు సమావేశమవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత సెమీకండక్టర్ ప్రయాణానికి ఇంటెల్ సంస్థ చూపుతున్న నిబద్ధతను ఆయన హృదయపూర్వకంగా స్వాగతించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘శ్రీ లిప్-బు టాన్‌ను కలిసినందుకు సంతోషంగా ఉంది. మన సెమీకండక్టర్ ప్రయాణం పట్ల ఇంటెల్ సంస్థ నిబద్ధతను భారత్ స్వాగతిస్తోంది. సాంకేతికత కోసం ఆవిష్కరణల ఆధారిత భవిష్యత్తును నిర్మించడానికి, ఇంటెల్ సంస్థ మన యువతతో కలిసి పనిచేయడంలో గొప్ప అనుభవాన్ని పొందుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.’’
(रिलीज़ आईडी: 2201178)
आगंतुक पटल : 6