ప్రధాన మంత్రి కార్యాలయం
నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 DEC 2025 3:21PM by PIB Hyderabad
నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సేవ, ధైర్య-సాహసాలు, కరుణ మూలాధారాలుగా విలసిల్లుతున్న నాగాలాండ్ వైభవోపేత సంస్కృతి సర్వత్ర ప్రశంసలకు పాత్రమవుతోంది. ‘‘నాగాలాండ్ ప్రజలు అనేక రంగాల్లో పేరు-ప్రఖ్యాతులు సంపాదించారు. రాబోయే కాలాల్లోనూ ఈ రాష్ట్రం సమృద్ధినీ, ప్రగతినీ సాధిస్తూ పురోగమించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. సేవ, ధైర్య-సాహసాలు, కరుణ మూలాధారాలుగా విలసిల్లుతున్న నాగాలాండ్ వైభవోపేత సంస్కృతి సర్వత్ర ప్రశంసలకు పాత్రమవుతోంది. నాగాలాండ్ ప్రజలు అనేక రంగాల్లో పేరు-ప్రఖ్యాతులు సంపాదించారు. రాబోయే కాలాల్లోనూ ఈ రాష్ట్రం సమృద్ధినీ, ప్రగతినీ సాధిస్తూ పురోగమించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2196960)
आगंतुक पटल : 3