ప్రధాన మంత్రి కార్యాలయం
‘ది సింధియా స్కూల్’ 125వ సంస్థాపన దినోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 OCT 2023 7:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 21న సాయంత్రం 5 గంటలకు గ్వాలియర్‌లోని ‘ది సింధియా స్కూల్’ 125వ సంస్థాపన దినోత్సవంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ‘మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్’కు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే, విశిష్ట పూర్వ విద్యార్థులు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రస్తుత విద్యార్థులకు పాఠశాల వార్షిక అవార్డులు ప్రదానం చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
చారిత్రక గ్వాలియర్ కోట పైభాగంలో ‘ది సింధియా స్కూల్’ను 1897లో ప్రారంభించారు.
(रिलीज़ आईडी: 2196941)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam