ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌ విజేతలైన భారత అంధ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి విందు

प्रविष्टि तिथि: 27 NOV 2025 10:03PM by PIB Hyderabad

 అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను  గెలుచుకున్న  భారతీయ అంధ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆతిథ్యాన్ని ఇచ్చారు. మహిళా క్రీడాకారులతో శ్రీ మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ఆటల పోటీలో తమకు కలిగిన అనుభవాలను  మహిళా క్రీడాకారులు వివరించారు. 
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారతీయ అంధ మహిళల క్రికెట్ జట్టుకు విందు ఇవ్వడం సంతోషదాయకం. వారి అనుభవాలు నిజంగా ఎంతో స్ఫూర్తిని ఇచ్చేవిగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. 


(रिलीज़ आईडी: 2196724) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam