ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రసిద్ధ నటుడు శ్రీ ధర్మేంద్ర మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
24 NOV 2025 3:06PM by PIB Hyderabad
ప్రసిద్ధ నటుడు శ్రీ ధర్మేంద్ర జీ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. భారతీయ చలనచిత్రరంగంలో ఒక యుగం సమాప్తం అయిందని ప్రధానమంత్రి బాధను వ్యక్తం చేశారు.
లబ్ధప్రతిష్ఠ వ్యక్తిత్వం కలిగిన సినీ ప్రముఖుడు, గొప్ప నటుడు ధర్మేంద్ర గారు.. ఆయన పోషించిన ప్రతి భూమికకూ వన్నెలద్దడంతో పాటు సునిశితత్వాన్ని జోడించారని ప్రధానమంత్రి ప్రశంసించారు. విభిన్న పాత్రలను రక్తి కట్టించిన ఆయన నటనా ప్రతిభ భిన్న తరాలకు చెందిన ప్రేక్షకుల్ని అశేష సంఖ్యలో అలరించింది అని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ధర్మేంద్ర జీ నిష్క్రమించడంతో భారత చలనచిత్ర జగతిలో ఒక యుగం ముగిసింది. ఆయనో సినీ దిగ్గజం.. అసాధారణ నటుడు.. ఆయన పోషించిన ప్రతి భూమికకూ వన్నె తేవడమే కాక సునిశితత్వాన్ని కూడా జోడించారు. విభిన్న పాత్రలను ఆయన పోషించి రక్తి కట్టించిన తీరు అశేష ప్రజానీకాన్ని అలరించింది. ధర్మేంద్ర గారు.. ఆయన సీదాసాదా తనానికీ, వినయానికీ, ఆప్యాయతకూ మరో పేరు. ఈ దు:ఖ ఘడియలో ఆయన కుటుంబానికీ, మిత్రులకూ, అసంఖ్యాక అభిమానులకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2193855)
आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam