56వ ఇఫిలో ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన మూకీచిత్రం ‘మురళీవాలా’ ప్రత్యేక ప్రదర్శన
మూకీచిత్ర యుగంనాటి ప్రత్యక్ష సంగీత అనుభవం ద్వారా 1920నాటి కాలానికి వెళ్లిన ప్రేక్షకులు
నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద ఇండియన్ పనోరమా
ప్రత్యేక ప్యాకేజీలో ప్రదర్శనకు ఎంపికైన 18 క్లాసిక్ చిత్రాలు
ఇఫి నాలుగో రోజు పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాల్లో ఒకటైన ‘మురళీవాలా’ ప్రత్యేక ప్రదర్శనతో ప్రేక్షకులు కాలయానం అనుభూతిని పొందారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఇండియా (ఎన్ఎఫ్డీసీ) కలిసి నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎం) కింద 18 క్లాసిక్ చిత్రాలకు మళ్లీ జీవం పోశాయి. వీటిని ఈ ఏడాది ఇఫి కోసం ఇండియన్ పనోరమా ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది. ఇందులో హిందీ, తెలుగు, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల సినిమాలు ఉన్నాయి. విశాలమైన కళాత్మక వ్యక్తీకరణల పరిధిని ఈ చిత్రాలు ప్రతిబింబిస్తాయి. ఈ చిత్రాలన్నింటినీ దాని అసలైన సృజనాత్మక ఉద్దేశానికి గౌరవమిస్తూ, కఠినమైన ఆర్కైవల్ ప్రమాణాలతో భద్రపరిచారు.
మూకీ చిత్రాల యుగానికి పునరుజ్జీవం
ఎన్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మాగ్దం ఈ ప్రత్యేక ప్రదర్శన ఉద్దేశాన్ని వివరించారు. ‘‘నేటి తరానికి మూకీ చిత్రాల అనుభవాన్ని తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ ప్రదర్శనలో, సంగీత విద్వాంసులు ముందు వరుసలో కూర్చుని ప్రేక్షకుల కోసం ప్రత్యక్ష సంగీతాన్ని అందిస్తారు. ప్రతిభావంతుడైన రాహుల్ నాయకత్వంలో స్ఫూర్తి, అదే వైభవంతో మళ్లీ జీవం పోసుకుంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను’’ అని ఆయన అన్నారు.
సంగీత దర్శకుడు రాహుల్ రనాడే మాట్లాడుతూ.. ‘‘98 సంవత్సరాల క్రితం రూపొందిన చిత్రానికి సంగీతాన్ని పునర్నిర్మించడం, దానిని ప్రత్యక్షంగా ప్రదర్శించడం నాకూ, నా బృందానికి గొప్ప గౌరవంతోపాటు పెద్ద సవాలు కూడా. 1927లో బాబురావ్ గారు రూపొందించిన సినిమా ఎలాంటిదో, ఆయన సృష్టించిన ప్రత్యేక ఎఫెక్ట్‌లు ఎలాంటివో మీరు అనుభూతి చెందబోతున్నారు. దీనికి నేను, నా బృందం న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాను.
దివంగత సిరీ నిర్మాత, కళాకారుడు బాబూరావు పెయింటర్ రూపొందించిన చిత్రం ‘మురళీవాలా’ (1927). ఇది మిగిలి ఉన్న అతి కొద్ది భారతీయ మూకీ చిత్రాల్లో ఒకటి. దీనిని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎం అత్యంత అరుదైన నిధుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ప్రదర్శన ప్రేక్షకులకు 1920ల నాటి సినిమా ప్రదర్శనను గుర్తు చేసే భావానుభూతిని అందించింది.
ముఖ్యంగా ఈ ప్రదర్శనకు బాబూరావు పెయింటర్ ఇద్దరు కుమార్తెలు కూడా హాజరవ్వడం విశేషం.
ఓ వైభవోత్సవ సంవత్సరం
ఈ సంవత్సరం చలనచిత్ర ప్రదర్శన అనేక చారిత్రక అంశాలతో కూడి ఉంది. వీ శాంతారామ్ గారి 125 సంవత్సరాల వారసత్వానికి ఈ చిత్రోత్సవం గౌరవం అందిస్తుంది. అలాగే దేశ సినీ పరిశ్రమకు మార్గదర్శకం చేసిన దిగ్గజాలు గురు దత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, భూపెన్ హజారికా, పి. భానుమతి, సలీల్ చౌధురి, కె. వైకుంఠ్ గార్ల 100వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నారు. ఆధునిక భారతీయ సినిమా రూపురేఖలను తీర్చిదిద్దడంలో ఎన్‌ఎఫ్‌డీసీ పోషించిన పాత్రను గుర్తిస్తూ.. సంస్థ 50 సంవత్సరాల వేడుకను కూడా జరుపుకుంటుంది. భారతీయ కథనంపై దార్శనిక దర్శకుడు శ్యామ్ బెనగల్ చూపిన ప్రభావాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆయన రూపొందించిన ‘‘సుస్మాన్’’ చిత్రానికి ప్రత్యేక నివాళి అర్పిస్తున్నారు.
నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 2016లో ప్రారంభమైన నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ముఖ్యమైన చలనచిత్ర వారసత్వ పరిరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. దేశ చలనచిత్ర వారసత్వాన్ని రక్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అంటే కెమెరా నెగటివ్లు, విడుదల ప్రింట్లు, అరుదైన ఆర్కైవల్ సంపదలు మొదలైనవన్నింటినీ భద్రపరచడం, కాపాడటం, డిజిటల్ రూపంలోకి మార్చడం, పాత చిత్రాలను మళ్లీ కొత్తగా మార్చడం దీని లక్ష్యం. వీటిని హక్కుదారులు, వ్యక్తిగత సేకరణదారులు, అంతర్జాతీయ సంస్థలు వంటి వివిధ వనరుల నుంచి సేకరిస్తారు.
ఇఫి 2025 కోసం పునరుద్ధరించిన భారతీయ చలన చిత్రాలు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎం కృషికి నిదర్శనంగా నిలుస్తాయి. ప్రతి దృశ్యాన్ని ఎంతో శ్రద్ధతో పునరుద్ధరించారు. రంగుల క్రమబద్ధీకరణ కూడా చాలా ఖచ్చితత్వంతో చేశారు. అనేక సందర్భాల్లో స్వయంగా దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు లేదా వారి సన్నిహిత సహచరుల మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది.
ఈ చిత్రోత్సవంలో రిత్విక్ ఘటక్ దర్శకత్వం వహించిన ‘‘సువర్ణరేఖ’’ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్ఎఫ్డీసీ–ఎన్ఎఫ్ఏఐ సేకరణలో ఉన్న 35ఎంఎం మాస్టర్ పాజిటివ్ నుంచి దీనిని పునరుద్ధరించగా.. తుది రంగల క్రమద్దీకరణ పనులనుప్రముఖ సినిమాటోగ్రాఫర్ అవిక్ ముఖోపాధ్యాయ్ పర్యవేక్షించారు.
ముజఫర్ అలీ దర్శకత్వం వహించిన ఉమ్రావ్ జాన్ కూడా విశేషంగా పునరుద్ధరించారు. సినిమా అసలు నెగటివ్ తిరిగి మార్చలేని విధంగా దెబ్బతినడం వల్ల భద్రపరిచిన 35 ఎంఎం విడుదల ప్రింట్ నుంచి దీనిని పునరుద్దరించారు. దర్శకుడు ముజఫ్ఫర్ అలీ స్వయంగా కలర్ గ్రేడింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం ద్వారా చిత్రానికి ప్రత్యేకమైన రంగుల సౌందర్యం యధాతథంగా నిలిచింది.
ఈ పునరుద్ధరణలు దేశ సినీ చరిత్రలో అత్యంత దిగ్గజాల వారసత్వానికి గౌరవిస్తాయి. తమ సినీ వారసత్వాన్ని కాపాడుకోవాలనే దేశ సంకల్పాన్ని ఇవి బలోపేతం చేస్తాయి. ఈ సినిమాల్లో పొందుపరిచిన సాంస్కృతిక, చారిత్రక, కళాత్మక కథనాలు కొత్త తరాలకు కూడా చేరువయ్యేలా చేస్తున్నాయి.
ఇండియన్ పనోరమా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎంపికైన పునరుద్ధరించిన చిత్రాల జాబితా
1. ఉమ్రావ్ జాన్ (ముజాఫర్ అలీ-హిందీ/145 నిమిషాలు/4కే డీసీపీ)
2. మల్లీశ్వరి (బీఎన్ రెడ్డి-తెలుగు /175 నిమిషాలు/4కే డీసీపీ)
3. రూడాలి (కల్పనా లాజ్మీ-హిందీ/128 నిమిషాలు /4కే డీసీపీ)
4. గమన్ (ముజాఫర్ అలీ-హిందీ/119 నిమిషాలు / 4కే డీసీపీ)
5. ఫియర్ (రిత్విక్ ఘటక్–హిందీ/18 నిమిషాలు/4కే డీసీపీ)
6. సువర్ణరేఖ (రిత్విక్ ఘటక్–బెంగాలీ/143 నిమిషాలు/4K DCP)
7. మురలీవాలా (బాబురావ్ పెయింటర్-మూకీ/45 నిమిషాలు)
8. పార్టీ (గోవింద్ నిహలాని-హిందీ/118 నిమిషాలు/2కే డీసీపీ)
9. సీఐడీ (రాజ్ ఖోస్లా-హిందీ/146 నిమిషాలు/4కే డీసీపీ)
10. ప్యాసా (గురు దత్-హిందీ/146 నిమిషాలు/4కే డీసీపీ)
11. ఏక్ డాక్టర్ కి మౌత్ (టపన్ సిన్హా-హిందీ/122 నిమిషాలు/4కే డీసీపీ)
12. ఏక్ హోతా విదూషక్ (జబ్బార్ పటేల్-మరాఠీ/168 నిమిషాలు/4కే డీసీపీ)
13. కిరీటం (సీబీ మలయిల్-మలయాళం/124 నిమిషాలు/4కే డీసీపీ)
14. డాక్టర్ కోట్నిస్ కి అమర్ కహానీ (వీ శాంతారామ్-హిందీ/100 నిమిషాలు/2కే డీసీపీ)
15. సుస్మాన్ (శ్యామ్ బెనెగల్-హిందీ/140 నిమిషాలు/2కే డీసీపీ)
16. ముసాఫిర్ (హృషికేశ్ ముఖర్జీ-హిందీ/127 నిమిషాలు/4కే డీసీపీ)
17. షహీద్ (రమేష్ సైగల్-హిందీ/1948/4కే డీసీపీ)
18. గీతాంజలి (మణిరత్నం–తెలుగు/137 నిమిషాలు/ 4కే డీసీపీ)
మరిన్ని వివరాల కోసం, క్లిక్ చేయండి:
ఐఎఫ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ చానల్:
https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ ఖాతాలు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2193836
| Visitor Counter:
3