ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం


ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయిబాబాకు ప్రధానమంత్రి నివాళులు

శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఏర్పాటు చేసిన గోదాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 NOV 2025 1:46PM by PIB Hyderabad

సాయిరాం నామ స్మరణ నడుమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చేరుకున్నారుస్థానికులు అత్యంత ఆత్మీయంగా ప్రధానమంత్రికి స్వాతం పలికారు.

ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో శ్రీ సత్య సాయిబాబాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారుఆ తరువాత ఓంకార్ హాలుకు వెళ్లిదర్శించుకున్నారుఈ పవిత్ర స్థలాల్ని దర్శించుకోవడంతో శ్రీ సత్య సాయిబాబా అపార కరుణమానవాళి అభ్యుదయం కోసం ఆయన జీవన పర్యంతం కనబరచిన నిబద్ధత తనకు గుర్తుకు వచ్చాయని ప్రధానమంత్రి అన్నారునిస్వార్థంగా సేవ చేస్తూ ఉండాలని శ్రీ సత్య సాయిబాబా ఇచ్చిన సందేశం లక్షల మందికి మార్గదర్శకంగా నిలుస్తూస్ఫూర్తిని అందిస్తోందని శ్రీ మోదీ అన్నారు.
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఏర్పాటు చేసిన గోదాన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాలుపంచుకున్నారుఈ ట్రస్టు పశు సంరక్షణ రంగంలో విశిష్ట కృషి చేయడం సహా అనేక ఉదాత్త కార్యక్రమాలను నిర్వహిస్తోందిఈ సందర్భంగా ప్రధానమంత్రి తన శుభాశీస్సులను అందించారుశ్రీ సత్య సాయిబాబా చూపిన మార్గంలో అంతా నడుస్తూసమాజ హితం కోసం పనిచేయాలని ప్రధానమంత్రి అన్నారు.

 

ఎక్స్’లో వివిధ సందేశాల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 

‘‘సాయిరాం నామ స్మరణ నడుమ ఎంతో ఆప్యాయతతో స్వాగతం పలుకుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చేరుకున్నా.’’

 

“ ‘‘ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో శ్రీ సత్య సాయిబాబాకు నివాళులు అర్పించాను. ఓంకార్ హాలుకు వెళ్లి, దర్శనం చేసుకున్నాను. ఈ పవిత్ర స్థలాల్ని దర్శించడం ఆయన అపార కరుణనూ, మానవాళి అభ్యుదయానికి ఆయన జీవన పర్యంతం చూపిన నిబద్ధత గుర్తుకు వస్తాయి. నిస్వార్థంగా సేవ చేయాలని ఆయన ఇచ్చిన సందేశం లక్షల మందికి మార్గాన్ని చూపుతోంది, స్ఫూర్తిని అందిస్తోంది.’’.”

“Among the many noble deeds they are doing, the Sri Sathya Sai Central Trust has focused greatly on animal welfare. Today, took part in the Gaudan Ceremony, in which farmers are being given cows. The cows in the pictures below are Gir Cows! May we all keep working for the welfare of our society, as shown by Sri Sathya Sai Baba.”

*******


MJPS/ST


(रिलीज़ आईडी: 2191654) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam