ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సూరత్ లో భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టు బృందంతో ప్రధానమంత్రి సంభాషణ

Posted On: 16 NOV 2025 3:27PM by PIB Hyderabad

బుల్లెట్ రైలు ఉద్యోగిబుల్లెట్ రైలు మన గుర్తింపుఈ విజయం -  మోదీ జీ,  మీకు మాత్రమే కాదుమాకు కూడా చెందుతుంది.

ప్రధానమంత్రిమీరేమనుకుంటున్నారుఈ వేగం ఫర్వాలేదామీరు నిర్దేశించుకున్న టైమ్‌ టేబుల్ ప్రకారమే పనిచేస్తున్నారాలేక ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?

బుల్లెట్ రైలు ఉద్యోగిలేదు సార్మాకు  ఎలాంటి ఇబ్బందులు లేవు

ప్రధానమంత్రిమీరేం చెప్పాలనుకుంటున్నారు

బుల్లెట్ రైలు ఉద్యోగినేను కేరళ వాడినినేను సెక్షన్-2, నవ్‌సారి నాయిస్ (బారియర్ ఫ్యాక్టరీ)లో పనిచేస్తున్నాను.

ప్రధానమంత్రిమీరు గుజరాత్‌కి రావడం ఇదే మొదటిసారా?

బుల్లెట్ రైలు ఉద్యోగిఅవును సార్నేను ఇక్కడ సెక్షన్-2లోని నాయిస్ బారియర్ ఫ్యాక్టరీలో రోబోటిక్ యూనిట్‌ను పర్యవేక్షిస్తున్నానునాయిస్ బారియర్ కోసం రీబార్ కేజ్‌ను రోబోల సహాయంతో వెల్డింగ్ చేస్తున్నాం.

ప్రధానమంత్రిఈ బుల్లెట్ రైలును నిర్మించడంభారత్‌లో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో భాగం కావడం గురించి మీకు ఎలా అనిపిస్తోందివ్యక్తిగతంగా మీరు ఏమనుకుంటున్నారుమీ కుటుంబ సభ్యులతో ఏం చెబుతారు?

బుల్లెట్ రైలు ఉద్యోగిసార్ఇది ఒక కలలా అనిపిస్తోందినేను ఇప్పుడు చేస్తున్న పని భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందిఇది నా కుటుంబానికినాకు గర్వకారణమైన క్షణం సార్.

ప్రధానమంత్రిచూడండి, 'నేను నా దేశం కోసం పనిచేస్తున్నానునేను దేశానికి ఏదో కొత్తది ఇస్తున్నానుఅని మీకు మనసులో అనిపించకపోతేఆ పనికి అర్థం ఉండదుఅంతరిక్ష ఉపగ్రహాన్ని మొట్టమొదట ప్రయోగించిన వ్యక్తికి అలాగే అనిపించి ఉంటుందిఈ రోజు వందలాది ఉపగ్రహాల ప్రయోగం జరుగుతోంది

బుల్లెట్ రైలు ఉద్యోగినమస్తే సర్నా పేరు శృతినేను బెంగళూరు నుంచి వచ్చానునేను లీడ్ ఇంజనీరింగ్ మేనేజర్‌నిడిజైన్ఇంజనీరింగ్ నియంత్రణను చూసుకుంటానుమీరు చెప్పినట్లుగాప్రారంభ ప్రణాళికఅమలు ఏదైనాఅది తొలి దశల్లోనే మొదలవుతుంది.  ఆ తర్వాత మనం అమలుకి వెళ్లినప్పుడుప్రతి దశలో లాభనష్టాలను చూస్తాంఏదైనా పని చేయకపోతేఇది ఎందుకు పని చేయడం లేదు అని అడుగుతాం మేం ముందు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాంఅప్పటికీ మాకు సాధ్యం కాకపోతేప్రత్యామ్నాయ పరిష్కారాల పై దృష్టి పెట్టి అలా దశలవారీగా ముందుకెడతాంసర్.

ప్రధానమంత్రిమీ అనుభవాలతో ఒక రకమైన "బ్లూ బుక్వంటిది తయారు చేస్తే మనం మరిన్ని బుల్లెట్ రైళ్లను నిర్మించే దిశగా సాగుతున్నప్పుడు అది దేశానికి చాలా సహాయపడుతుందిప్రతిసారీ ప్రతి ఒక్కరూ మొదటి నుంచి ప్రారంభించాలని మనం కోరుకోంఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇతర చోట్ల అమలు చేయాలికానీ ఒక పనిని ఒక నిర్దిష్టమైన విధానంలోనే ఎందుకు చేయాలన్నది తెలిస్తేనే అది సాధ్యమవుతుందిలేకపోతే ప్రజలు అర్థం చేసుకోకుండా కేవలం మూస విధానంలో వెళతారు.  మీరు మీ అనుభవాలను రికార్డు చేస్తేఅది భవిష్యత్తులో విద్యార్థులకు కూడా సహాయపడుతుందిమీరు ఇక్కడ మీ జీవితాన్ని అంకితం చేస్తారుదేశం కోసం విలువైనదాన్ని వదిలి వెళతారు.

 

***

 

(Release ID: 2190622) Visitor Counter : 3