ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి భూటాన్‌ పర్యటన: ముఖ్య నిర్ణయాలు

Posted On: 11 NOV 2025 6:10PM by PIB Hyderabad

ప్రారంభోత్సం:

1. భారత ప్రభుత్వం, భూటాన్ దేశప్రభుత్వాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నిర్మించిన 1020 మెగావాట్ల పునత్సాంగ్‌చు-II జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం.

ప్రకటనలు:

2. 1200 మెగావాట్ల పునత్సాంగ్‌చు-I జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట నిర్మాణ పనుల పునఃప్రారంభంపై అంగీకారం.

3. భూటాన్ ఆలయం/మఠం,  అతిథి గృహ నిర్మాణానికి వారణాసిలో భూమి మంజూరు.

4. గెలెఫు ప్రాంతంలోని హతీసార్‌లో వలస చెక్‌పోస్టు ఏర్పాటుకు నిర్ణయం.

5. భూటాన్‌కు రూ. 4,000 కోట్ల విలువైన రుణం మంజూరు

అవగాహన ఒప్పందాలు..

వరుస సంఖ్య

ఒప్పందం పేరు

వివరణ

భూటాన్‌ తరపున సంతకం చేసిన వ్యక్తి

భారత్‌ తరపున సంతకం చేసిన వ్యక్తి

6.

పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై ఒప్పందం

పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని వ్యవస్థీకృతం చేయడమే  అవగాహన ఒప్పంద లక్ష్యంఇది సౌరశక్తిపవన శక్తిబయోమాస్శక్తి నిల్వగ్రీన్ హైడ్రోజన్ మరియు సామర్థ్య నిర్మాణం వంటి రంగాలలో కలిసి పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంధనం, సహజ వనరుల మంత్రి లియోన్పో జెమ్  షెరింగ్

నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి

7.

ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై ఒప్పందం

ఈ ఒప్పందం  వైద్య రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని వ్యవస్థీకృతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో  ఔషధాలు, నిర్ధారణ పరికరాలు, వైద్య పరికరాలు, తల్లీ, గర్ణిణీల ఆరోగ్య సంరక్షణ, సంచార/అసంచార వ్యాధుల నివారణ చికిత్స, సంప్రదాయ వైద్యం, టెలీమెడిసిన్ వంటి డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు, సాంకేతిక సహకారం, సంయుక్త పరిశోధన, వైద్య నిపుణుల సామర్థ్యాభివృద్ధి వంటి అంశాల్లో సహకారం పెంపొందించడమే ప్రధాన ఉద్ధేశం

వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పెంబా వాంగ్‌చుక్
 

భూటాన్‌లో భారత రాయబారి శ్రీ సందీప్ ఆర్య,

8.

భూటాన్‌లోని పెమా సెక్రటేరియట్, భారత్‌లోని  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ మధ్య సంస్థాగత అనుబంధాన్ని  ఏర్పరచుకునే  ఒప్పందం

మానసిక ఆరోగ్య నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం, సేవల మెరుగుదల, పరిశోధనకు తోడ్పడే విధంగా దేశంలో మానసిక ఆరోగ్య కోర్సులను అభివృద్ధి చేయడంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని ఈ ఒప్పందం బలోపేతం చేస్తుంది.

భూటాన్‌లోని పెమా సెక్రటేరియట్ అధిపతి శ్రీమతి డెచెన్ వాంగ్మో

 

భూటాన్‌లో భారత రాయబారిశ్రీ సందీప్‌ ఆర్య

 

***


(Release ID: 2189041) Visitor Counter : 16