ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవంబర్ 8న ‘‘ న్యాయ సహాయ పంపణీ వ్యవస్థల బలోపేతం’’ జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 06 NOV 2025 2:50PM by PIB Hyderabad

సుప్రీంకోర్టులో ‘‘న్యాయ సహాయ పంపణీ వ్యవస్థల బలోపేతం’’ జాతీయ సదస్సును 2025 నవంబర్ 8న సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవల అథారిటీ (ఎన్ఏఎల్ఎస్రూపొందించిన కమ్యూనిటీ మధ్యవర్తిత్వ శిక్షణ మాడ్యూల్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఎన్ఏఎల్ఎస్ ఆధ్వర్యంలో రెండు రోజలు జరిగే ఈ సదస్సులో.. న్యాయ సహాయ రక్షణ సలహాదారుల వ్యవస్థ, ప్యానెల్ న్యాయవాదులు, పారా-లీగల్ వాలంటీర్లు, శాశ్వత లోక్ అదాలత్‌లు, న్యాయ సేవల సంస్థల ఆర్థిక నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

 


(Release ID: 2187106) Visitor Counter : 5