ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మలేషియా ప్రధానితో సంభాషించిన ప్రధానమంత్రి


ఆసియాన్‌కు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో శుభాకాంక్షలు

ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సుకు వర్చువల్‌గా హాజరు కానున్న పీఎం

Posted On: 23 OCT 2025 10:13AM by PIB Hyderabad

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయంగా సంభాషించారు.

ఆసియాన్‌కు మలేషియా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని గౌరవ ఇబ్రహీంకు శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుఆసియాన్‌కు సంబంధించి మలేషియా సారథ్యంలో త్వరలో జరగబోయే సదస్సులు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఆసియాన్భారత్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోదీ ఆసక్తి వ్యక్తం చేశారుఅలాగే ఆసియాన్భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:

‘‘నా ప్రియ మిత్రుడుమలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఆత్మీయంగా మాట్లాడానుఆసియాన్‌కు మలేషియా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలియజేశానుఅలాగే త్వరలో జరగబోయే సదస్సులు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశానుఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సద్సులో వర్చువల్‌గా పాల్గొనేందుకుఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాను.’’


(Release ID: 2181800) Visitor Counter : 10