ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నివాళి

Posted On: 21 OCT 2025 9:10AM by PIB Hyderabad

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బంది ధైర్యానికీవారి త్యాగాలకీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా నివాళులర్పించారుదేశాన్నిపౌరులను రక్షించడంలో వారి అచంచలమైన అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ఈ రోజు ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. అమరులైన పోలీసు సిబ్బంది చూపిన పరాక్రమానికీవిధి నిర్వహణలో వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి వందనం చేద్దాంమన దేశాన్నిపౌరులను వారి అంకితభావమే రక్షిస్తోందిసంక్షోభాల్లోఅవసరమైన సమయాల్లో వారు చూపిన ధైర్యందృఢ సంకల్పం ప్రశంసనీయం.’’

 

***


(Release ID: 2181146) Visitor Counter : 28