ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ


గాజా శాంతి ఒప్పందంలో ఈజిప్టు కీలకపాత్ర పోషించినందుకు ఆ దేశ అధ్యక్షుడు సిసీకి ప్రధాని అభినందనలు
తన పర్యటనలో భాగంగా జరిగే తొలి భారత్-ఈజిప్టు వ్యూహాత్మక చర్చ గురించి ప్రధానికి వివరించిన విదేశాంగ మంత్రి అబ్దుల్లాటీ

ద్వైపాక్షిక సహకారంలోని వివిధ రంగాల్లో సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పీఎం

Posted On: 17 OCT 2025 4:23PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దుల్లాటీ ఈ రోజు సమావేశమయ్యారు.

గాజా శాంతి ఒప్పందంలో ఈజిప్టు కీలక పాత్ర పోషించినందుకు.. అధ్యక్షుడు సిసీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారుఇది ఈ ప్రాంతంలో సుదీర్ఘ శాంతికి మార్గం చూపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

తన పర్యటనలో భాగంగా నిర్వహించే మొదటి భారత్-ఈజిప్టు వ్యూహాత్మక చర్చ గురించి ప్రధానమంత్రికి విదేశాంగ మంత్రి అబ్దుల్లాటీ వివరించారు.

వాణిజ్యంసాంకేతికతఇంధనంరక్షణప్రజా సంబంధాలతో సహా ద్వైపాక్షిక సహకారంలోని వివిధ రంగాల్లో సాధించిన పురోగతి పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

 

***


(Release ID: 2180433) Visitor Counter : 11