ప్రధాన మంత్రి కార్యాలయం
కొత్త శక్తిని అందుకున్న జలమార్గాలు.. దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దడంలో వాటి పాత్రను వివరించిన వ్యాసం.. ఆ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 OCT 2025 1:16PM by PIB Hyderabad
కొత్త శక్తిని నింపిన జల మార్గాలకు సంబంధించి, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ తన దృష్టికోణాన్నీ, ఆయా జల మార్గాలు ‘వికసిత్ భారత్’ ఆశయ సాధన దిశగా పురోగమిస్తున్న తీరునూ వివరిస్తూ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. ‘‘భారత్‌లో నదులు ఒక్క వారసత్వ ప్రతీకలే కావు.. అవి ప్రగతికి రాచబాటలు’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.
కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ -
‘‘భారత్‌లో నదులు కేవలం వారసత్వ ప్రతీకలు కావు, అవి ప్రగతికి రాచబాటలు. పునరుద్ధరించిన జల మార్గాల విషయంలో కేంద్ర మంత్రి శ్రీ @సర్బానంద సొనోవాల్ తన దృష్టికోణంతో పాటు, ‘వికసిత్ భారత్’ ఆశయ సాధనలో ఆయా జలమార్గాలు తోడ్పడుతున్న తీరును కూడా వివరించారు.
ఆధునిక వస్తు రవాణా వ్యవస్థనూ, పర్యటన రంగాన్నీ, మౌలిక సదుపాయాలనూ గత కొన్ని సంవత్సరాల్లో సుదృఢంగా తీర్చిదిద్దిన తీరుతెన్నులను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి’’ అని ప్రజలకు సూచించారు.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2180403)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam