ప్రధాన మంత్రి కార్యాలయం
నానాజీ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ పట్ల నానాజీ దేశ్‌ముఖ్‌కు ఉన్న గౌరవాన్ని, జాతి నిర్మాణం పట్ల ఆయన దార్శనికతను గుర్తు చేసుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
11 OCT 2025 9:58AM by PIB Hyderabad
నానాజీ దేశ్‌ముఖ్ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దార్శనికత గల సామాజిక సంస్కర్త, జాతి నిర్మాత.. స్వావలంబన, గ్రామీణ సాధికారత కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తిగా నానాజీ దేశ్‌ముఖ్‌ను ఆయన అభివర్ణించారు. ఆయన జీవితం.. అంకితభావం, క్రమశిక్షణ, సమాజ సేవకు ప్రతిరూపమని ప్రధాని అన్నారు.
లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ నుంచి నానాజీ దేశ్‌ముఖ్ ప్రేరణ పొందారన్న ప్రధాని.. జేపీ పట్ల నానాజీకి ఉన్న గౌరవం- యువజన అభివృద్ధి, సేవ, జాతి నిర్మాణం పట్ల దార్శనికత జనతా పార్టీ మహామంత్రిగా ఉన్నప్పుడు ఆయనిచ్చిన సందేశంలో ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ప్రధానమంత్రి ఇలా అన్నారు:
“గొప్ప వ్యక్తి నానాజీ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. ఆయన దార్శనికత గల సామాజిక సంస్కర్త, జాతి నిర్మాత, స్వావలంబన- గ్రామీణ సాధికారత కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి. సమాజం కోసం అంకితభావం, క్రమశిక్షణ, సేవల ప్రతిరూపం ఆయన జీవితం.”
"లోక్‌నాయక్ జేపీ నుంచి నానాజీ దేశ్‌ముఖ్ ఎంతో ప్రేరణ పొందారు. జేపీ పట్ల ఆయనకున్న గౌరవం, యువజనాభివృద్ధి, సేవ, జాతి నిర్మాణం పట్ల ఆయనకున్న దార్శనికత.. జనతా పార్టీకి మహామంత్రిగా ఉన్నప్పుడు పంచుకున్న సందేశంలో తెలుస్తోంది."
***
(रिलीज़ आईडी: 2177735)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam