ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 25 SEP 2025 8:59PM by PIB Hyderabad

రష్యా ఉప ప్రధాని దిమిత్రీ పత్రుషేవ్మంత్రి వర్గంలో నా సహచరులు చిరాగ్ పాశ్వాన్శ్రీ రన్వీత్శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులుప్రతినిధులువిశిష్ట అతిధులుసోదరీసోదరులారా!

వరల్డ్ ఫుడ్ ఇండియాకు మీ అందరికీ స్వాగతంఈ రోజు ఈ కార్యక్రమంలో మన రైతులుఔత్సాహిక పారిశ్రామికవేత్తలుపెట్టుబడిదారులువినియోగదారులు అందరూ ఒకే గొడుగు కిందకు చేరుకున్నారుకొత్త పరిచయాలునూతన సంబంధాలుసృజనాత్మకతల ఉత్సవంగా వరల్డ్ ఫుడ్ ఇండియా మారిందిఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను నేను ఇప్పుడే సందర్శించానుపోషకాహారంవంటనూనె వినియోగాన్ని తగ్గించడంప్యాకేజ్డ్ ఉత్పత్తులను ఆరోగ్యకరంగా మార్చడంపై ప్రధాన దృష్టి సారించడం చూసి సంతోషిస్తున్నానుఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలుఅభినందనలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

ఒక ప్రదేశంలో పెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతానికున్న సహజ సామర్థ్యాలను అంచనా వేస్తారుఇప్పుడు ఆహార రంగంలో పెట్టుబడులు పెట్టేవారు భారత్ వైపు ఆశావహ దృక్పథంతో చూస్తున్నారుఎందుకంటే.. వైవిధ్యండిమాండువిస్తృతి అనే మూడు బలాలు భారత్‌కున్నాయిప్రతి గింజ ధాన్యమూప్రతి ఫలమూప్రతి కూరగాయా భారత్‌లో పండుతోందిఈ వైవిధ్యమే భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని అందించిందిమనదేశంలో ప్రతి వంద కిలోమీటర్లకు ఆహారంరుచులు మారుతుంటాయివివిధ రకాల ఆహార పదార్థాలకు భారత్‌లో విశేషమైన డిమాండ్ ఉందిఈ గిరాకీయే భారత్‌ను పోటీలో నిలిపిపెట్టుబడిదారులకు అనువైన గమ్యస్థానంగా మార్చింది.

స్నేహితులారా,

ఇప్పుడు భారత్ మునుపెన్నడూ లేని విధంగాఅసాధారణ రీతిలో అభివృద్ధి చెందుతోందిగడచిన పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని ఓడించారుఇప్పుడు వీరంతా నవ మధ్యతరగతిలో భాగమయ్యారుఈ నవ మధ్యతరగతి దేశంలో అత్యంత ఉత్సాహవంతమైనఆకాంక్షాత్మక విభాగంఇంత పెద్ద సంఖ్యలోని ప్రజల ఆకాంక్షలే.. ఆహార సరళిని రూపొందిస్తున్నాయిఈ ఆకాంక్షాత్మక తరగతే.. డిమాండును పెంచుతోంది.

స్నేహితులారా,

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ యువత గొప్ప విజయాలను సాధిస్తోందిదానికి మన ఆహార రంగం మినహాయింపేమీ కాదుఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఎదిగిందిఅందులో ఎక్కువ భాగం ఆహారంవ్యవసాయ రంగానికి సంబంధించినవే ఉన్నాయిఏఐ-కామర్స్డ్రోన్లుయాప్‌లు ఈ రంగంలో భాగమవుతున్నాయిమన అంకుర సంస్థలు సరఫరా వ్యవస్థలురిటెయిల్ప్రాసెసింగ్‌ల్లో మార్పులు తీసుకొస్తున్నాయివైవిధ్యండిమాండుఆవిష్కరణలకు భారత్ వేదికగా ఉందిఅందుకే పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్‌ మారిందిఎర్రకోట బురుజుల నుంచి నేను చెప్పిన విషయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నానుభారత్‌లో పెట్టుబడులు పెట్టడానికివ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం.

స్నేహితులారా,

ఈ ప్రపంచానికి 21వ శతాబ్దం తీసుకొచ్చిన సవాళ్ల గురించి మనందరికీ తెలుసుఅలాగే ప్రపంచానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారి తనదైన రీతిలో సానుకూల పాత్ర పోషించడానికి భారత్ ఎప్పుడూ ముందుకు వస్తుందిప్రపంచ ఆహార భద్రత కోసం భారత్ నిరంతరం కృషి చేస్తోందిమన రైతులుపాడి రైతులుమత్స్యకారుల కృషికితోడ్పాటునిచ్చే ప్రభుత్వ విధానాలకు ధన్యవాదాలువాటి వల్ల భారత్ సామర్థ్యం పెరుగుతోందిగత దశాబ్దంలో మన ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందిప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉందిప్రపంచ పాల అవసరాల్లో 25 శాతాన్ని దేశం అందిస్తోందిమనం అతి పెద్ద చిరుధాన్యాల ఉత్పత్తిదారుగా కూడా ఉన్నాంవరిగోధుమల్లో మనం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాంపండ్లుకూరగాయలుమత్స్య ఉత్పత్తుల్లో సైతం భారత్‌కు గణనీయమైన వాటా ఉందిఅందుకే ప్రపంచంలో ఎక్కడైనా ఆహార సంక్షోభం లేదా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినప్పుడు భారత్ ముందుకొచ్చి తన బాధ్యతను నిర్వర్తిస్తుంది.

స్నేహితులారా,

ప్రపంచ సంక్షేమం దృష్ట్యా భారత్ సామర్థ్యాన్నిసహకారాన్ని మరింత పెంపొందించుకొనేందుకు మనం కృషి చేస్తున్నాందీని కోసమే.. మొత్తం ఆహారంపోషకాల రంగాన్నిదీనితో ముడిపడి ఉన్నవారందరనీ ప్రభుత్వం బలోపేతం చేస్తుందిమా ప్రభుత్వం ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహిస్తోందిఅందుకే ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిచ్చాందీనికి అదనంగా.. పీఎల్ఐ పథకంమెగా ఫుడ్ పార్కుల విస్తరణ ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నాయిప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజి మౌలిక వసతుల పథకాన్ని అమలు చేస్తోందిప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలితాలు కనిపిస్తున్నాయిగత పదేళ్లలోఆహార శుద్ధి పరిశ్రమ సామర్థ్యం ఇరవై రెట్లు పెరిగిందిశుద్ధి చేసిన ఆహార ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.

స్నేహితులారా,

ఆహార సరఫరావిలువ వ్యవస్థలో రైతులుపాడి రైతులుమత్స్యకారులుచిన్న ప్రాసెసింగ్ యూనిట్లు కీలకపాత్రను పోషిస్తున్నాయివీరందరినీ గత దశాబ్దంలో మా ప్రభుత్వం బలోపేతం చేసిందిభారత్‌లో 85 శాతం మంది చిన్నసన్నకారు రైతులేనని మీకు తెలుసుఅందుకే.. వారికి మద్దతు ఇచ్చే.. విధానాలనువ్యవస్థలను రూపొందించాందీంతో ఇప్పుడు చిన్న రైతులు మార్కెట్లో ప్రధాన శక్తిగా ఎదుగుతున్నారు.

మిత్రులారా

ఉదాహరణకుమన స్వయం సహాయ సంఘాలు సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్లను నడుపుతున్నాయిఈ స్వయం సహాయ సంఘాలు  మన గ్రామాలలో లక్షలాది మంది ప్రజలతో అనుసంధానంగా ఉన్నాయివారికి మద్దతు ఇవ్వడానికి మా ప్రభుత్వం రుణ ఆధారిత సబ్సిడీలను అందిస్తోందిఈ రోజు కూడాసుమారు 800 కోట్ల రూపాయల సబ్సిడీలను మీ సమక్షంలో ఇప్పుడే ఈ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు  బదిలీ చేశాం.

మిత్రులారా

అలాగేమా ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్పీఓలువిస్తరిస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పదివేల ఎఫ్పీఓలు ఏర్పాటయ్యాయివీటి ద్వారా లక్షలాదిమంది చిన్న రైతులు అనుసంధానమయ్యారువీటి ద్వారా చిన్న రైతులు తమ పంటలను విస్తృత స్థాయిలో మార్కెట్‌కు తీసుకెళ్లగలుగుతున్నారుఅంతేకాదువీటి పాత్ర ఈ ఒక్కదానికే పరిమితం కాదుఈ ఎఫ్పీఓలు ఆహార శుద్ధి  రంగంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయిబ్రాండెడ్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయిమన ఎఫ్పీఓల శక్తి సామర్ధ్యాలను చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారుఈరోజు మన ఎఫ్పీఓల 15,000కు పైగా ఉత్పత్తులు ఆన్‌లైన్ వేదికల్లో లభ్యమవుతున్నాయికాశ్మీర్‌ నుంచి బాస్మతి బియ్యంకుంకుమపువ్వుఅక్రూట్లు,  హిమాచల్‌ నుంచి జామ్‌ఆపిల్ జ్యూస్రాజస్థాన్‌ నుంచి మిల్లెట్ కుకీలు,  మధ్యప్రదేశ్‌ నుంచి సోయా నగెట్స్,  బీహార్‌ నుంచి సూపర్‌ఫుడ్ మఖానామహారాష్ట్ర నుంచి వేరుశెనగ నూనెబెల్లంకేరళ నుంచి అరటి చిప్స్కొబ్బరి నూనె ఇలా కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మన ఎఫ్పీఓలు భారతీయ వ్యవసాయ వైవిధ్యాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాయిఇంకా మీకు సంతోషం  కలిగించే విషయం ఏమిటంటే 1,100 కంటే ఎక్కువ ఎఫ్పీఓలు కోటీశ్వరులుగా మారారుఅంటే వాటి వార్షిక టర్నోవర్ కోటి రూపాయల మార్కును దాటిందిఈరోజురైతుల ఆదాయాన్ని పెంచడంలోయువతకు ఉపాధి కల్పించడంలో ఎఫ్పీఓలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

మిత్రులారా

ఎఫ్పీఓలతో పాటుసహకార సంఘాలు కూడా భారతదేశంలో గొప్ప శక్తిగా నిలుస్తున్నాయిఈ సంవత్సరం అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరంభారతదేశంలో సహకార సంఘాలు మన పాడి రంగానికిగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందిస్తున్నాయిసహకార సంఘాల ప్రాధాన్యతను గుర్తించివాటి అవసరాలకు అనుగుణంగా మా విధానాలను రూపొందించేందుకు  ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాంఈ రంగానికి పన్నుపారదర్శకత సంబంధిత సంస్కరణలను కూడా చేపట్టాంఈ విధాన స్థాయి మార్పులు సహకార రంగానికి కొత్త శక్తిని అందించాయి.

మిత్రులారా

సముద్రమత్స్య రంగంలో భారత్ సాధించిన వృద్ధి కూడా విశేషంగా ఉందిగత దశాబ్దంలో మత్స్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను విస్తరించాం.  మత్స్యకారులకు ఆర్థిక మద్దతులోతైన సముద్రంలో చేపలు పట్టే పడవల కోసం సహాయాన్ని అందించాందీని వల్ల మన సముద్ర ఉత్పత్తిఎగుమతులు రెండూ పెరిగాయిఈరోజు ఈ రంగం దాదాపు మూడు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందిఅలాగే సముద్ర ఉత్పత్తుల శుద్ధి ప్రక్రియను  విస్తరించడానికి కూడా మేం కృషి చేస్తున్నాంఇందుకోసం ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లుకోల్డ్ చైన్లుస్మార్ట్ హార్బర్లు వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాం.

మిత్రులారా

పంటల సంరక్షణ కోసం ఆధునిక సాంకేతికతలో కూడా మేం పెట్టుబడులు పెడుతున్నాంరైతులను ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీతో అనుసంధానిస్తున్నాందీని వల్ల మన వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకాలం పెరిగిందిఆహార భద్రత బలపడిందిఈ పనిలో నిమగ్నమైన యూనిట్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది.

మిత్రులారా

భారత్ ఈ రోజు ఆవిష్కరణలుసంస్కరణల కొత్త మార్గంలో ముందుకు సాగుతోందిప్రస్తుతంమన దేశంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోందిరైతుల కోసం ఈ సంస్కరణలు తక్కువ వ్యయాలుఎక్కువ లాభాల  భరోసాను కల్పిస్తున్నాయివెన్ననెయ్యిపై కేవలం 5% జీఎస్టీ ఉన్నందునరైతులు ఉత్పత్తిదారులు భారీగా లాభపడతారుపాల కంటెయినర్లపై కూడా పన్ను కేవలం 5% మాత్రమే ఉందిదీని వల్ల రైతులుఉత్పత్తిదారులకు మంచి ధరలు లభిస్తాయిఅలాగే పేదమధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో ఎక్కువ పోషకాహారం లభిస్తుందిఈ సంస్కరణల వల్ల ఆహార శుద్ధి రంగం కూడా గణనీయంగా లాభపడనుందితినడానికి సిద్ధంగా ఉన్ననిల్వ చేసిన పండ్లుకూరగాయలు,  నట్స్‌పై కేవలం శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందినేడు 90 శాతానికి పైగా శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులు సున్నా లేదా శాతం పన్ను తరగతిలోకి వస్తాయిబయో ఆధారిత పురుగుమందులుసూక్ష్మపోషకాలపై పన్నులు తగ్గాయిజీఎస్టీ సంస్కరణల కారణంగాబయో ఇన్‌పుట్‌లు చౌకగా మారాయిఇది చిన్న తరహా సేంద్రీయ రైతులకు,   ఎఫ్‌పిఓలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

మిత్రులారా

నేడుబయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు కూడా  డిమాండ్ ఉందిమన ఉత్పత్తులు తాజాగా,  అధిక నాణ్యతతో ఉండటం ముఖ్యం.   దీనితో పాటుప్రకృతి పట్ల మనకు బాధ్యత కూడా ఉందిఅందువల్లప్రభుత్వం బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి శాతానికి తగ్గించిందిబయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు సంబంధించిన ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టాలనివీలైనంత త్వరగా మన ఉత్పత్తి ప్యాకేజింగ్ మొత్తాన్ని బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లకు మార్చాలని  పరిశ్రమ భాగస్వాములందరినీ నేను  కోరుతున్నా

మిత్రులారా

భారత్ ఉదార స్ఫూర్తితో ప్రపంచానికి తన తలుపులు తెరిచి ఉంచిందిఆహార శ్రేణితో సంబంధం ఉన్న పెట్టుబడిదారులందరికీ మేం స్వాగతం పలుకుతున్నాంసహకారం విషయంలో విశాల దృక్పథం కలిగి ఉన్నాంమీరందరూ భారత్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయివాటిని సద్వినియోగం చేసుకోండిఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా

ధన్యవాదాలు.

 

***


(Release ID: 2171944) Visitor Counter : 6