ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వీడియో అనుసంధానం ద్వారా రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

प्रविष्टि तिथि: 26 FEB 2024 2:35PM by PIB Hyderabad

నమస్కారం!
నవ భారత్‌ కొత్త పనితత్వానికి నేటి కార్యక్రమం ఉదాహరణగా నిలుస్తుందిఈ రోజు దేశం ఏం చేసినా.. అది అపూర్వమైన వేగంస్థాయిలో కొనసాగుతోందిప్రస్తుత భారత్ ఇకపై చిన్న కలలకే పరిమితం కాదు.. దీనికి బదులుగా ఆశయాలను సాకారం చేసుకొనేందుకు ప్రతిష్ఠాత్మకంగాఅవిశ్రాంతంగా కృషి చేస్తుందిఈ దృఢ సంకల్పం అనే స్ఫూర్తి.. 'వికసిత్ భారత్వికసిత్ రైల్వేకార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తోందిఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పాల్గొన్న నా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానుగౌరవ గవర్నర్లుముఖ్యమంత్రులు.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు.. ఎంపీలుఎమ్మెల్యేలుస్థానిక ప్రతినిధులుప్రముఖులుపద్మ అవార్డు గ్రహీతలుభారత స్వాతంత్ర్య ఉద్యమకారులుమన భవిష్యత్ తరం లేదా యువ స్నేహితులు సహా 500 లకు పైగా రైల్వే స్టేషన్లు, 1500 లకు  పైగా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది మనతో ఉన్నారు.

మీ అందరి సమక్షంలో ఈ రోజు 2000 లకు పైగా రైల్వే సంబంధిత ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేశాంజూన్ నుంచి మా ప్రభుత్వ మూడో పదవీకాలం ప్రారంభం కానున్నందన మేం చేస్తున్న పని స్థాయివేగం అందరినీ ఆశ్చర్యపరుస్తోందికొన్ని రోజుల క్రితం జమ్మూ నుంచే ఐఐటీలుఐఐఎంల వంటి అనేక ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను ఒకేసారి ప్రారంభించే అవకాశం నాకు లభించిందినిన్న రాజ్‌కోట్ నుంచి నేను ఏకకాలంలో ఐదు ఎయిమ్స్ఇతర అనేక వైద్య సౌకర్యాలను ప్రారంభించానుఇప్పుడు ఈ కార్యక్రమంలో 27 రాష్ట్రాలలోని 300 లకు పైగా జిల్లాల్లో 500 లకు పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శంకుస్థాపన చేశాంఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభించిన గోమతినగర్ రైల్వే స్టేషన్ నిజంగా ఆకట్టుకుంటోంది. 1500లకు పైగా రోడ్డుపైవంతెనఅండర్‌పాస్ ప్రాజెక్టులు ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా ఉన్నాయిరూ. 40 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులను ఏకకాలంలో చేపట్టనున్నాంకొన్ని నెలల క్రితం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని మేం ప్రారభించాంఇందులో భాగంగా 500 స్టేషన్ల ఆధునీకరణ పనులను అప్పుడే  మొదలుపెట్టాంఇవాల్టి కార్యక్రమం దీని పురోగతిని తెలియజేస్తోందిభారత్ పురోగతి ఎంత వేగంగా ముందుకు సాగుతుందో ఇది వివరిస్తుందిదేశంలోని రాష్ట్రాలకునా తోటి ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు నా యువ స్నేహితులకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానుఅభివృద్ధి చెందిన భారత్ గురించి మోదీ చెబుతున్నారంటే.. దాని వల్ల లబ్ధి పొందేది దేశాన్ని నిర్మించే యువతేఈ రోజు ఆవిష్కరించిన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు కొత్త ఉపాధిస్వయం ఉపాధి అవకాశాలను అందిస్తాయిరైల్వేల పునరుజ్జీవనం అనేది ప్రస్తుతం పాఠశాలలుకళాశాలల్లో చదువుతున్న వారికి.. అలాగే 30-35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందిమన యువత కలలకు సంబంధించిన దార్శనికతే అభివృద్ధి చెందిన భారత్అందుకే దేశ భవిష్యత్తును రూపొందించే ప్రధాన హక్కు వారికే ఉందిదేశం నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు వివిధ పోటీల ద్వారా అభివృద్ధి చెందిన భారతీయ రైల్వేలు అనే లక్ష్యం కోసం వారి కలలను ముందుకు తీసుకొస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నానుఈ యువతలో చాలామంది అవార్డులను అందుకున్నారుఇందులో ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు చెబుతున్నానుమీ ఆకాంక్షలే మోదీ నిబద్ధత అని మన దేశంలోని ప్రతి యువతకు తెలియజేస్తున్నానుమీ కలలుమీ అంకితభావంతో పాటు మోదీ సంకల్పం.. అభివృద్ధి చెందిన భారత్‌కు పునాదిగా ఉంటుంది

మిత్రులారా

ఈ అమృత్ భారత్ స్టేషన్లు సాంస్కృతిక వారసత్వంఅభివృద్ధి.. రెండింటికీ చిహ్నాలుగా ఉండటం పట్ల నేను సంతోషంగా ఉన్నానుఒడిశాలోని బాలేశ్వర్ రైల్వే స్టేషన్‌ను తీసుకుంటే.. దీనిని జగన్నాథ భగవానుడి ఆలయం ఇతివృత్తంతో రూపొందించారుసిక్కింలోని రంగ్పో రైల్వే స్టేషన్‌లో స్థానిక నిర్మాణ శైలి ఉందిరాజస్థాన్‌లోని సంగనేర్ రైల్వే స్టేషన్‌లో 16వ శతాబ్దానికి చెందిన హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్ ఉందితమిళనాడులోని కుంభకోణం స్టేషన్ రూపకల్పన చోళుల కాలం నాటి వాస్తుశిల్ప కల నుంచి ప్రేరణ పొందిందిమోధేరా సూర్య దేవాలయం నుంచి ప్రేరణతో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దారుఅదేవిధంగా గుజరాత్‌లోని ద్వారక స్టేషన్‌లో ద్వారకాధీష్ ఆలయం స్ఫూర్తి ఉందిఐటీ సిటీ గుర్గావ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకమైన ఐటీ ఇతివృత్తంతో ఉందిఈ విధంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రతి నగర ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేస్తోందిఈ స్టేషన్ల నిర్మాణంలో వికలాంగులువృద్ధుల సౌకల్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.

మిత్రులారా

గత దశాబ్దంలో మనం ఒక కొత్త భారత్ ఆవిర్భవించటాన్ని చూశాంరైల్వేలలో వచ్చిన మార్పు మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోందిఒకప్పుడు మన దేశ ప్రజల ఊహకే పరిమితమైన సౌకర్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయిఒక దశాబ్దం క్రితం వందే భారత్ఆధునిక సెమీ-హైస్పీడ్ రైళ్లు లేదా అమృత్ భారత్ఆధునిక లగ్జరీ రైళ్లు వంటివి ఎవరికీ తెలియవుఅదేవిధంగా నమో భారత్ వంటి విలాసవంతమైన రైళ్లుభారతీయ రైల్వేల్లో విద్యుదీకరణ వేగవంతం కావటం అనేవి ఎంతో దూరంలో ఉన్నట్లు అనిపించిందిరైళ్లుస్టేషన్లు పరిశుభ్రంగా ఉండటం అంటే ఒక పెద్ద సవాలునే భావన ఒకప్పుడు ఉండేదికానీ నేడు ఇది రోజువారీ జీవితంలో ఒక సాధారణ అంశంగా మారిందిఒకప్పుడు ఎక్కువగా కనిపించిన మానవరహిత గేట్ల స్థానంలో పైవంతెనలుఅండర్‌బ్రిడ్జిలు వచ్చాయిఇవి ఆటంకం లేని ప్రమాద రహిత ప్రయాణం కొనసాగేలా చూసుకుంటున్నాయివీటితో పాటు ఒకప్పుడు విమానాశ్రయాలకు మాత్రమే ప్రత్యేకమైన ఆధునిక సౌకర్యాలు ఇప్పుడు రైళ్లపై ఆధారపడే పేదలుమధ్యతరగతి ప్రజలతో సహా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

మిత్రులారా

దశాబ్దాలుగా రైల్వేలు రాజకీయ స్వార్థ ప్రయోజనాలు అనే భారాన్ని మోసాయిఅయితే ఇవిప్పుడు మన ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందించే మూలస్తంభంగా మారాయిగతంలో నష్టాల్లో ఉందన్న విమర్శను ఎదుర్కొన్న రైల్వేలు ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన పరివర్తన దశలో ఉన్నాయిఈ పురోగతి ఫలితంగా భారతదేశం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 11 నుంచి 5వ స్థానానికి వచ్చిందిఒక దశాబ్దం క్రితం అంటే మనం 11వ స్థానంలో ఉన్నప్పుడు.. రైల్వేల సగటు బడ్జెట్ సుమారు రూ. 45 వేల కోట్లునేడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్లు దాటిందిప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి కేంద్రంగా మనం ఎదిగినప్పుడు మనకు ఎంత సామర్థ్యం ఉంటుందో ఊహించుకోండిఅందుకే వీలైనంత త్వరగా భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు మోదీ అంకితభావంతో కృషి చేస్తున్నారు.

కానీ మిత్రులారా

పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో కీలకమైన అంశం ఉందినదులుకాలువలలో ఎంత సమృద్ధిగా నీళ్లున్నా.. కట్ట తెగిపోతే చాలా తక్కువ నీరు రైతుల పొలాలకు చేరుకుంటుందిఅదే మాదిరిగా బడ్జెట్ పరిమాణంతో సంబంధం లేకుండా అవినీతినిర్లక్ష్యం కొనసాగితే బడ్జెట్ వల్ల స్పష్టమైన ప్రభావం క్షేత్రస్థాయిలో ఎప్పుడూ కనిపించదుగత దశాబ్దంలో మేం భారీగా కుంభకోణాలనుప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకున్నాంతత్ఫలితంగా కొత్త రైల్వే మార్గాల నిర్మాణ వేగం రెట్టింపు అయిందినేడు భారతీయ రైల్వేల పరిధి జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య ప్రాంతాలకు వరకు విస్తరిస్తోందిగతంలో ఊహకు కూడా అందని ప్రాంతాలకు రైళ్లు వెలుతున్నాయి. 2500 కిలోమీటర్లకు పైగా ఉన్న ప్రత్యేక సరకు రవాణా కారిడార్ నిర్మాణం పూర్తి చేయడం అనేది నిజాయితీతో ప్రాజెక్టులను చేపట్టే తీరుకు ఉదాహరణగా నిలుస్తోందిటికెట్ ఆదాయంతో సహా పన్ను చెల్లింపుదారుల ప్రతి పైసా రైల్వే ప్రయాణికుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామనే విషయాన్ని ఇది తెలియజేస్తోందిభారత ప్రభుత్వం ప్రతి రైల్వే టికెట్‌ను సుమారు 50 శాతం తగ్గింపుతో ప్రజలకు అందిస్తోంది

మిత్రులారా

బ్యాంకుల్లో జమ చేసిన డబ్బుపై వడ్డీ వచ్చినట్లే.. మౌలిక సదుపాయాల కోసం పెట్టే ప్రతి పైసా కొత్త ఆదాయ వనరులుఉపాధి అవకాశాలను సృష్టిస్తుందికొత్త రైల్వే మార్గం నిర్మాణం వల్ల కార్మికుల నుంచి ఇంజనీర్ల వరకు వివిధ రకాల వాళ్లకు ఉపాధి లభిస్తుందిదీనితో పాటు సిమెంట్ఉక్కురవాణా వంటి అనుబంధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందిలక్షల కోట్ల రూపాయల ఈ భారీ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలకు భరోనిస్తాయిస్టేషన్లు పెద్దవిగాఆధునికంగా మారడంతో ఎక్కువ రైళ్లుప్రయాణికులు వెళ్తారుతద్వారా సమీపంలో ఉన్న వీధి వ్యాపారులు ప్రయోజనం పొందుతారుమన రైల్వేలు చిన్న రైతులుచేతివృత్తులవారువిశ్వకర్మ మిత్రుల ఉత్పత్తులను కూడా ప్రోత్సహిస్తాయివీరి ఉత్పత్తుల విక్రయాన్ని సులభతరం చేసేందుకు 'ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకంకింద స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలను కల్పించాంఇందులో వేలాది స్టాళ్లు ఏర్పాటయ్యాయి.

మిత్రులారా

భారతీయ రైల్వేలు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా దేశ వ్యవసాయపారిశ్రామిక పురోగతికి ప్రాథమిక సహాయకారిగా కూడా పనిచేస్తాయిరైళ్ల వేగం పెరగటం వల్ల సమయం ఆదా అవుతుందిదీనివల్ల పాలుచేపలుపండ్లు వంటి పాడైపోయే ఉత్పత్తులను మార్కెట్‌కు వేగంగా రవాణా చేయొచ్చుఇది పారిశ్రామిక ఖర్చులను తగ్గించటంతో పాటు 'భారత్‌లో తయారీ', 'ఆత్మనిర్భర్ భారత్వంటి కార్యక్రమాలను బలోపేతం చేస్తుందినేడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్‌ను పరిగణిస్తున్నారుదీనికి ప్రధాన కారణం ఇక్కడి ఆధునిక మౌలిక సదుపాయాలేరాబోయే ఐదు సంవత్సరాల్లో వేలాది స్టేషన్ల ఆధునీకరణ జరిగిరైల్వేల సామర్థ్యం పెరగటం వల్ల మరో ముఖ్యమైన పెట్టుబడి విప్లవం వస్తుందిపరివర్తన చెందుతున్నందుకు భారతీయ రైల్వేకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానునేటి కార్యక్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రులుగవర్నర్లతో సహా లక్షలాది మంది ప్రజల సమష్టిగా భాగస్వామ్యం కావటం అనేది భారతదేశ సాంస్కృతిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలియజేస్తోందిఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందని నమ్ముతున్నానునేటి కార్యక్రమం భవిష్యత్ పనులకు సానుకూల ఉదాహరణగా నిలుస్తుందని అనుకుంటున్నానుఈ రోజు మనం తెలుసుకున్నట్లుగా మన సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూఅన్ని రకాలుగా అభివృద్ధిని వేగవంతం చేద్దాంమీ అందరికీ నా శుభాకాంక్షలుచాలా ధన్యవాదాలు!

గమనికప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిందీ ప్రసంగానికి అనువాదం.

 

***


(रिलीज़ आईडी: 2168980) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam