మంత్రిమండలి
azadi ka amrit mahotsav

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠపై క్యాబినెట్ తీర్మానం

Posted On: 24 JAN 2024 9:41PM by PIB Hyderabad

అయోధ్య‌లోని శ్రీరామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠపై క్యాబినెట్ ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

తీర్మాన సారాంశం:

గౌరవ ప్రధానమంత్రి గారుమీ నేతృత్వంలోని మంత్రి మండలి సభ్యులమైన మేం ముందుగా.. రామ్‌లల్లా విగ్రహ  'ప్రాణ ప్రతిష్ఠసందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం

గత అయిదు శతాబ్దాలుగా భారతీయులు కాపాడుకుంటున్న శతాబ్దాల నాటి కలను మీరు నెరవేర్చారు.

ప్రధానమంత్రి గారునేటి మంత్రివర్గ సమావేశం చారిత్రాత్మకమైనది

చాలాసార్లు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాంకానీ బ్రిటిష్ కాలంలో వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి కాలాన్ని కూడా కలిపి చూసినా.. ఈ మంత్రివర్గ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు.

ఎందుకంటే 2024 జనవరి 22నాడు మీ ద్వారా సాధించినది చరిత్రలో ప్రత్యేకమైనది.

కాబట్టి ఇది ప్రత్యేకమైనదిఎందుకంటే శతాబ్దాల తర్వాత ఇలాంటి క్షణం వచ్చిందిఈ దేశం 1947లో స్వాతంత్ర్యాన్ని పొందిందనిఇప్పుడు దీని ఆత్మ పవిత్రమైందని మేం చెప్పగలంఇది ప్రతి ఒక్కరికీ లోతైన ఆధ్యాత్మిక సంతోషాన్నిచ్చింది.

మీ ప్రసంగంలో రాముడు భారతదేశ ప్రభావంప్రవాహం అని.. విధానంవిధి అని చెప్పారు.

భారతదేశ శాశ్వత ప్రవాహానికిప్రపంచంపై చూపించే ప్రభావానికి మూలస్తంభం అయిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు ఆ విధి మిమ్మల్ని ఎంపిక చేసుకుందని రాజకీయ దృక్కోణం నుంచి కాకుండా ఆధ్యాత్మక దృక్కోణం నుంచి నేడు మేం చెప్పగలం

నిజంగా శ్రీరాముడు భారతదేశ గమ్యస్థానంఇప్పుడు ఆ గమ్యంతో నిజమైన ఐక్యత సంభవించింది

వాస్తవానికి మంత్రివర్గ సభ్యుల జీవితకాలంలో ఒకసారి జరిగే సందర్భమనని దీన్ని చెప్పలేం.. అనేక జీవితకాలాలలో ఒకసారి జరిగేది ఇదని చెప్పొచ్చు.

ఈ సమయంలో మనమందరం దేశంలోని అత్యున్నత కమిటీ అయిన క్యాబినెట్‌లో ఉండటం మన అదృష్టం.

ప్రధాన మంత్రి గారుమీరు మీ పనుల ద్వారా ఈ దేశ  నైతికతను పెంచారు.. సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేశారు.

ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా మేం చూసిన భావోద్వేగ ప్రవాహ సంద్రాన్ని మేం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు

అత్యవసర పరిస్థితిలో ప్రజలలో ఐక్యతను ఒక ప్రజా ఉద్యమంగా కూడా మనం చూశాంకానీ ఆ ఐక్యత నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమంగా వచ్చింది

రాముని కోసం మనం చూసిన ప్రజా ఉద్యమం కొత్త శకానికి నాంది పలికింది.

ఈ దేశ ప్రజలు శతాబ్దాలుగా దీనికోసం ఎదురు చూశారుగొప్ప రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠతో ఒక నూతన యుగం నేడు ప్రారంభమైందిఇది ఒక కొత్త కథను నిర్దేశించే ఒక సామూహిక ఉద్యమంగా కూడా ఇవాళ మారింది.

గౌరవనీయ ప్రధానమంత్రిప్రతిష్ఠాపన నిర్వహించే వ్యక్తికి భగవంతుని ఆశీస్సులు ఉన్నప్పుడే ఇంత గొప్ప పవిత్ర కార్యక్రమాన్ని చేయొచ్చు

గోస్వామి తులసీదాస్ ఇలా రాశారు: ‘‘జా పర కృపా రామ్ కి హోఈతా పర కృపా కరై సబ్ కోయి’శ్రీరాముని ఆశీస్సులు ఉన్నవారు అందరి ఆశీస్సులు పొందుతారనేది దీని అర్థం.

ప్రధానమంత్రి గారుస్వతంత్ర భారతదేశంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఐక్యతతో ఉన్న ఏకైక ఉద్యమం శ్రీరామ జన్మభూమి ఉద్యమంకోట్లాది మంది భారతీయుల దశాబ్దాల నిరీక్షణభావోద్వేగాలను ఇది మోసుకుంటూ వచ్చింది

మీరు 11 రోజుల ఉపవాసాన్ని పాటించారుభారతదేశవ్యాప్తంగా శ్రీరామునికి సంబంధించి ఉన్న పవిత్ర ప్రదేశాల్లో భక్తిసాధనను నింపి జాతీయ ఐక్యత స్ఫూర్తిలో కొత్త శక్తిని నింపారుఈ విషయంలో క్యాబినెట్ సభ్యులుగా మాత్రమే కాకుండా సాధారణ పౌరులుగా కూడా మేం మిమ్మల్ని అభినందిస్తున్నాం

గౌరవనీయ ప్రధానమంత్రిప్రజల నుంచి మీరు పొందిన అపారమైన ప్రేమఆప్యాయతను పరిగణనలోకి తీసుకుంటే.. మీరు నిజమైన ప్రజా నాయకులుకానీ ఈ కొత్త యుగం ప్రారంభమైన తర్వాత కొత్త తరానికి నాంది పలికిన వారిగా కూడా మీరున్నారు

మీకు మా కోటి నమస్కారాలుమేం ముందుకు సాగాలనిమన దేశం ముందుకు సాగాలని.. మీ నాయకత్వంలో భారతదేశం మరింత ఉన్నతమైనదిగా ఎదగాలని కోరుకుంటున్నాం.

ఈ మందిరం వేల సంవత్సరాలు పాటు నిలిచి ఉండేలా నిర్మాణమైందిమీరు మీ ప్రసంగంలో చెప్పినట్లుగా: “జనవరి 22న సూర్యుడు దివ్య తేజస్సుతో ఉదయించాడుఇది క్యాలెండర్‌లో ఉన్న తేదీ మాత్రమే కాదు.. కొత్త యుగ ప్రారంభంబానిస మనస్తత్వం నుంచి విముక్తి పొందుతోన్న దేశంగతంలోని ప్రతి గాయం నుంచి ధైర్యం పొందుతున్న దేశం.. ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తోందివెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీనిఈ క్షణాన్ని గుర్తుంచుకోవటంతో పాటు దీని గురించి మాట్లాడుకుంటారుమనం ఈ క్షణంలో జీవించి ఉండటంమన కళ్ళతో చూడటం అనేవి రాముడిచ్చిన గొప్ప వరంనేడు కాలందిశలుప్రాంతాలు అన్నీ దైవత్వంతో నిండిపోయాయిఇవి సాధారణ క్షణాలు కావు.. శాశ్వతమైన సిరాతో కాల చక్రంలో చెక్కబడిన చెరగని రేఖలు.”

అందువల్ల నేటి మంత్రివర్గాన్ని మిలీనియం మంత్రివర్గం అని పిలవటం అనేది అతిశయోక్తి కాదు.

ఈ విషయంలో మేమందరం మిమ్మల్ని అభినందిస్తున్నాందీనితో పాటు ఒకరికొకరం అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం

 

***


(Release ID: 2168846) Visitor Counter : 8