ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీల కర్కితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ మోదీ


నేపాల్ లో ఇటీవల జరిగిన నిరసనల్లో

ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

నేపాల్ ప్రజల పురోగతి, శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు

భారత్ పూర్తిగా సహకరిస్తుందన్న ప్రధానమంత్రి

Posted On: 18 SEP 2025 1:05PM by PIB Hyderabad

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి సుశీల కర్కితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్లో మాట్లాడారు.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నియమితులైన శ్రీమతి సుశీల కర్కిని అభినందిస్తూ... భారత ప్రభుత్వంప్రజల తరపున ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

నేపాల్ లో ఇటీవల జరిగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు.

రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందనినేపాల్ ప్రజల పురోగతిశాంతిస్థిరత్వాన్ని పునరుద్ధరించటానికి భారత్ పూర్తి మద్దతును అందిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన నేపాల్ ప్రధానమంత్రి కర్కి... తమ దేశానికి మద్దతుగా నిలిచినందుకు భారత ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంప్రదింపులు కొనసాగాలని నేతలు నిర్ణయించారు.


(Release ID: 2168265)