ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని గెలిచిన బాక్సర్ జైస్మిన్ లంబోరియా.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2025 7:36PM by PIB Hyderabad
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని భారతీయ మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా చేజిక్కించుకొన్నారు. ఆమె సాధించిన ఈ ప్రశంసనీయ విజయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను ఈ రోజు అభినందించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి నమోదు చేస్తూ-
‘‘ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో విజేతగా నిలిచిన మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా (@BoxerJaismine)కు అభినందనలు. అద్భుతంగా ఉన్న ఆమె ఆటతీరు రాబోయే కాలంలో అనేక మంది క్రీడాకారులకు, క్రీడాకారిణులకు స్ఫూర్తిని అందిస్తుంది. ఆమె భవిష్యత్తులో మరింతగా రాణించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2166903)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam