సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహ-నిర్మాణ మార్కెట్ కోసం 20,000 డాలర్ల నగదు సహయాన్ని ప్రకటించిన వేవ్స్ ఫిల్మ్ బజార్ గోవాలో జరగనున్న 19వ విడత వేవ్స్ ఫిల్మ్ బజార్

Posted On: 30 AUG 2025 1:46PM by PIB Hyderabad

దక్షిణాసియాలోనే అతిపెద్ద చలనచిత్ర మార్కెట్భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర ప్రచార కార్యక్రమాల్లో అంతర్భాగమైన వేవ్స్ ఫిల్మ్ బజార్… 19వ విడతకు సంబంధించి సహ-నిర్మాణ (కో-ప్రొడక్షన్మార్కెట్ కోసం అధికారిక ప్రకటన జారీ చేసిందిఈ కార్యక్రమం 2025 నవంబర్ 20 నుంచి 24 వరకు గోవాలోని మారియట్ రిసార్ట్‌లో జరగనుంది.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు (ఐఎఫ్ఎఫ్ఐసమాంతరంగా జరిగే ఫిల్మ్ బజార్‌ను కంటెంట్సృజనాత్మకతసహ-నిర్మాణాలకు భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చే విస్తృత వ్యూహంలో భాగంగా ‘వేవ్స్ ఫిల్మ్ బజార్‌’గా మార్చారుచిత్ర నిర్మాణంలో ప్రతిభగల భారతీయదక్షిణాసియా నిపుణులను అంతర్జాతీయ నిపుణులతో అనుసంధానించే ప్రధాన వేదికగా వేవ్స్ ఫిల్మ్ బజార్ తయారైందిగత సంవత్సరం జరిగిన ఈ కార్యక్రమంలో 40 కంటే ఎక్కువ దేశాల నుంచి 1,800 మందికి పైగా పాల్గొన్నారుఈ గణాంకాలు కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యతనుచలనచిత్ర పరిశ్రమలో దాని ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి

వేవ్స్ ఫిల్మ్ బజార్‌లోని ప్రధాన కార్యక్రమమైన సహా-నిర్మాణ మార్కెట్.. ఫీచర్డాక్యుమెంటరీ చిత్రాలకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2007లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ వేదిక చిత్ర నిర్మాతలకు కళాత్మకఆర్థికపరమైన సహాయం పొందేందుకు ప్రత్యేక అవకాశాలను అందించిందిఅంతర్జాతీయ భాగస్వామ్యాలుసహకార చిత్ర నిర్మాణాలను పెంపొందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర నిపుణులను ఏకం చేయడానికి ఈ మార్కెట్ కృషి చేస్తోంది

ది లంచ్‌బాక్స్దమ్ లగాకే హైషాన్యూటన్షిర్కోవాఇన్ లైస్ వుయ్ ట్రస్ట్గర్ల్స్ విల్ బి గర్ల్స్ఇన్ ది బెల్లీ ఆఫ్ ఎ టైగర్ వంటి అనేక ప్రశంసలు పొందిన చిత్రాల విజయంలో వేవ్స్ ఫిల్మ్ బజార్‌ పాత్ర కూడా ఉందిఇది ప్రపంచ సినిమా రంగంపై దాని ప్రభావాన్ని తెలియజేస్తోంది

2025 సహ-నిర్మాణ మార్కెట్ కోసం నగదు సహాయం:

2025 విడతలో సహ-నిర్మాణ మార్కెట్ నుంచి ఎంపికైన మూడు ప్రాజెక్టులకు మొత్తం 20,000 డాలర్ల నగదు సహాయాన్ని వేవ్స్ ఫిల్మ్ బజార్ అందించనుందివీటిని ఈ కింది విధంగా ఇవ్వనుంది:

1వ బహుమతిసహ-నిర్మాణ మార్కెట్ ఫీచర్ - $10,000

2వ బహుమతిసహ-నిర్మాణ మార్కెట్ ఫీచర్ - $5,000

స్పెషల్ నగదు సహాయంసహ-నిర్మాణ మార్కెట్ డాక్యుమెంటరీ - 5,000 డాలర్లు.

2024లో ప్రారంభించించిన ఈ నగదు సహాయం... చిత్ర నిర్మాణంలో కీలకమైన ఆర్థిక వనరులను అందిస్తుందితద్వారా సృజనాత్మక లక్ష్యంనిర్మాణానికి మధ్యనున్న అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందికిందట విడత కార్యక్రమంలో పాయల్ సేథీ దర్శకత్వం వహించిన కురింజి (ది డిసపియరింగ్ ఫ్లవర్మొదటి బహుమతిని గెలుచుకుందిరెండో బహుమతిని సంజు సురేంద్రన్ దర్శకత్వం వహించిప్రమోద్ శంకర్ నిర్మించిన కోథియాన్ ఫిషర్స్ ఆఫ్ మెన్‌కు అందిందిమూడో బహుమతిని ప్రాంజల్ దువా దర్శకత్వం వహించిబిచ్-క్వాన్ ట్రాన్ నిర్మించిన ఆల్ టెన్ హెడ్స్ ఆఫ్ రావణకు లభించింది.

సమర్పణకు గడువు:

ఫీచర్ సినిమా ప్రాజెక్ట్‌లను సమర్పించేందుకు చివరి తేదీ 2025 సెప్టెంబర్ కాగా.. డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ సమర్పించేందుకు గడువు 2025 సెప్టెంబర్ 13తో ముగియనుందిఎంపికైన చిత్రనిర్మాతలు భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకుసహ-నిర్మాణ ఒప్పందాలను చేసుకునేందుకు నిర్మాతలుపంపిణీదారులువిక్రయాలకు సంబంధించి వ్యక్తులుఫైనాన్షియర్‌లతో అనుసంధానమయ్యేందుకు ఉపయోగపడే విలువైన అవకాశాలను పొందుతారు.

వేవ్స్ ఫిల్మ్ బజార్ అదనపు కార్యక్రమాలు:

సహ-నిర్మాణ మార్కెట్‌తో పాటు వేవ్స్ ఫిల్మ్ బజార్.. ‘ది వ్యూయింగ్ రూం’ పేరుతో మార్కెట్‌ చిత్ర ప్రదర్శన సౌకర్యాన్ని అందిస్తుందిదాదాపు 200 కొత్తఇంతవరకు చూడని భారతీయదక్షిణాసియా చిత్రాలను ప్రదర్శించే వీడియో లైబ్రరీ ఇదిదీనితో పాటు వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్నాలెడ్జ్ సిరీస్ప్రొడ్యూసర్స్ వర్క్‌షాప్దేశాలకు సంబంధించిన పెవిలియన్లుమార్కెట్ స్టాల్స్ వంటి పరిశ్రమలకు చెందిన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందిఈ కార్యకలాపాలు నైపుణ్యాలను పెంపొందించడంపరిశ్రమలో చర్చలను పెంచటంప్రపంచ వేదికపై దక్షిణాసియా సినిమా స్థాయి పెంచటంలో వేవ్స్ ఫిల్మ్ బజార్‌కు ఉన్న నిబద్ధతను బలోపేతం చేస్తాయి.

 

***


(Release ID: 2162304) Visitor Counter : 11