ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ లోని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధానమంత్రి భేటీ
Posted On:
30 AUG 2025 7:34AM by PIB Hyderabad
జపాన్‌లోని స్థానిక ప్రభుత్వాల గవర్నర్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. 16 మంది గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత్-జపాన్ సమకాలీన సంబంధాలు.. ఇరు దేశాల మధ్య పురాతన నాగరిక సంబంధాల నుంచి శక్తిని పొందుతూ నిరంతరం వృద్ధి చెందుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వివిధ రంగాల్లో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామ్యంలో వేగాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. టోక్యో-ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంబంధాలకు మించి రాష్ట్రాల స్థాయిలో భాగస్వామ్యాలను ప్రోత్సాహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 15వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రారంభించిన రాష్ట్రాల భాగస్వామ్య కార్యక్రమ ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం, నైపుణ్యాలు, భద్రత, సాంస్కృతిక సంబంధాలకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. గవర్నర్లు, భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని.. తయారీ, సాంకేతికత, ఆవిష్కరణ, మొబిలిటీ, తదుపరి తరం మౌలిక సదుపాయాలు, అంకురసంస్థలు, ఎస్ఎమ్ఈ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని ప్రధానమంత్రి కోరారు.
జపాన్‌లోని ప్రతి రాష్ట్రం ప్రత్యేకమైన ఆర్థిక, సాంకేతిక బలాలు కలిగి ఉన్నవిధంగానే భారత రాష్ట్రాలకు వాటి సొంత విభిన్న సామర్థ్యాలున్నాయన్న ప్రధానమంత్రి.. భారత్ వృద్ధి గాథలో భాగస్వాములు కావాలని గవర్నర్లను ఆహ్వానించారు. యువత, నైపుణ్యాల బదిలీ విషయంలో చేసుకున్న ఒప్పందాలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని.. జపాన్ సాంకేతికతను భారతీయ ప్రతిభతో చక్కగా సమన్వయం చేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. భారత్-జపాన్ మధ్య వ్యాపారం, విద్య, సాంస్కృతిక, ప్రజా సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి దేశం నుంచి రాష్ట్రాల స్థాయి సహకారం కీలకమని గవర్నర్లు అభిప్రాయపడ్డారు.
***
(Release ID: 2162214)
Visitor Counter : 17
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada