ప్రధాన మంత్రి కార్యాలయం
భద్రతా సహకారంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
Posted On:
29 AUG 2025 7:43PM by PIB Hyderabad
భారత్-జపాన్ ప్రభుత్వాలు (ఇకమీదట ఇరుపక్షాలూ), ఉమ్మడి విలువలు, ప్రయోజనాల ఆధారంగా భారత్-జపాన్ రాజకీయ దృక్పథాన్ని, ప్రత్యేక వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామ్య లక్ష్యాలను గుర్తుచేసుకోవడం, నిబంధనల ఆధారితమైన అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించే ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో గల, శాంతియుతమైన, సుసంపన్నమైన, ఎలాంటి ఒత్తిళ్లు లేని ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో ఇరుదేశాల కీలక పాత్రను ప్రధానంగా ప్రాస్తావించడం, ఇటీవలి సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య గణనీయ పురోగతిని సాధించిన ద్వైపాక్షిక భద్రతా సహకారం.. ఇరుపక్షాల వ్యూహాత్మక దృక్పథం, పాలసీ ప్రాధాన్యాల పరిణామాలను ప్రస్తావించడం, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే వనరులు, సాంకేతిక సామర్థ్యాల పరంగా ఇరుదేశాల సమష్టి బలాలను గుర్తించడం, ఇరుదేశాల జాతీయ భద్రత, నిరంతర ఆర్థికవృద్ధి పరంగా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉండటం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఆ పొరుగున ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ఉమ్మడి భద్రతా సమస్యలను పరిష్కరించే విషయంలో మరింత సమన్వయాన్ని సాధించడం, రూల్ ఆఫ్ లా ఆధారంగా అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించుటకు కట్టుబడి ఉండటం, ఇరుదేశాల భాగస్వామ్యంలో నూతన దశను ప్రతిబింబిస్తూ భద్రతా సహకారంపై ఈ సంయుక్త ప్రకటనను ఆమోదించాయి. అలాగే కింది అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి:
- (3) బలవంతంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించడం వంటి అస్థిరపరిచే, ఏకపక్ష చర్యలను వ్యతిరేకించడం.. వివాదాల శాంతియుత పరిష్కారానికి, నావిగేషన్-ఓవర్ ఫ్లయిట్ స్వేచ్ఛకు, సముద్ర చట్టానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి సదస్సులో పేర్కొన్న అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్రాలను చట్టబద్ధంగా ఉపయోగించుటకు మద్దతునివ్వడం
- (4) క్వాడ్‌లో సహకారాన్ని మరింత పెంపొందించడం.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, పురోగతి కోసం క్వాడ్ సానుకూల, ఆచరణీయ ఎజెండాను కొనసాగించడం.
- (5) శాశ్వత, శాశ్వతేతర వర్గాల విస్తరణ సహా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎస్ఎస్సీ) సంస్కరణలను సమర్థించడం, విస్తరించిన యూఎన్ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం కోసం ఒక దేశం అభ్యర్థిత్వానికి మరొకరు మద్దతునివ్వడం
- (6) సరిహద్దు ఉగ్రవాదం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద వ్యక్తీకరణలను ఖండించడం.. ఉగ్రవాద కార్యకలాపాలకు భౌతిక, ఆర్థిక సహాయాన్ని పూర్తిగా నిరోధించడం కోసం కలిసి పనిచేయడం.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి బహుపాక్షిక వేదికలతో కలిసి పనిచేయడం.. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు నిర్వహణకు కృషి చేయడం
- (7) అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడం, అణ్వాయుధాల విస్తరణకు, అణ్వాయుధ ఉగ్రవాదానికి ముగింపు పలకడం, షానన్ ఆదేశం ఆధారంగా నిరాయుధీకరణపై జరిగే సమావేశంలో వివక్షత లేని, బహుపాక్షిక, అంతర్జాతీయంగా, సమర్థంగా ధ్రువీకరించదగిన ఫిస్సైల్ మెటీరియల్ కట్-ఆఫ్ ఒప్పందంపై చర్చలను వెంటనే ప్రారంభించి విజయవంతంగా ముగించడం పట్ల మా ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించడం
- (8) ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రయత్నాలను బలోపేతం చేయడం లక్ష్యంగా అణు సరఫరాదారుల బృందంలో భారత్ సభ్యత్వం కోసం కలిసి పనిచేయుటను కొనసాగించడం
6. ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులతో మంత్రుల స్థాయి 2+2 సమావేశం ద్వారా ప్రస్తుత ద్వైపాక్షిక సంప్రదింపులు, చర్చల విధానాన్ని.. కింది వివిధ యంత్రాంగాలతో వివిధ అధికారిక భద్రతా చర్చలను పూర్తి చేయడం, బలోపేతం చేయడం:
- (1) భారత్-జపాన్ ఎదుర్కొంటున్న భద్రతా పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడానికి ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు సంవత్సరానికోసారి చర్చించడం
- (2) పరస్పర ఆర్థిక భద్రతను పెంపొందించడం, వ్యూహాత్మక పరిశ్రమలు, సాంకేతికత విషయంలో సహకారాన్ని ప్రోత్సహించడం కోసం భారత విదేశాంగ కార్యదర్శి, జపాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి మధ్య వ్యూహాత్మక వాణిజ్యం, సాంకేతికత సహా ఆర్థిక భద్రత గురించిన చర్చలు నిర్వహించడం
- (3) జపాన్ ఆత్మరక్షణ దళాలు, భారత సాయుధ దళాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం లక్ష్యంగా ఉన్నత స్థాయి చర్చలు నిర్వహించడం
- (4) భారత్-జపాన్ తీరప్రాంత రక్షక దళాల మధ్య సహకార ఒప్పందం ఆధారంగా కోస్ట్ గార్డ్ కమాండెంట్ల స్థాయి సమావేశం నిర్వహించడం
- (5) వ్యాపారరంగ సహకారం కోసం గల అవకాశాలను గుర్తించడానికి భారత్-జపాన్ రక్షణ రంగ ఫోరంను బలోపేతం చేయడం
- (6) భద్రతా సవాళ్లను విస్తృతంగా అర్థం చేసుకోవడానికి, కొత్త సహకారం కోసం ఆలోచనలను సేకరించడానికి భారత్-జపాన్ అధికారిక, అనధికారిక రంగాల నిపుణులతో ట్రాక్ 1.5 చర్చలు నిర్వహించడం
***
(Release ID: 2162144)
Visitor Counter : 33
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam