ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ లో కుంభవృష్టి, వరద ప్రభావానికి గురైన వారికి ప్రధాని సంఘీభావం,
అన్ని విధాలుగా సాధ్యమైన సాయం చేస్తామని హామీ
Posted On:
14 AUG 2025 4:50PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆకస్మిక కుంభవృష్టి, అనంతరం సంభవించిన వరదలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తు ప్రభావానికి గురైన వారికి సకాలంలో సాయం అందించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ లో కుంభవృష్టి, వరదల కారణంగా ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కోసం ప్రార్థిస్తున్నాను. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. రక్షణ, సహాయక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అవసరమైన వారందరికీ అన్ని విధాలుగా సాధ్యమైన సాయం అందుతుంది.’’
(Release ID: 2156459)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam