ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశవిభజన- భయ విహ్వలత సంస్మరణ దినాన్ని పాటించిన ప్రధాని


• దేశ విభజన బాధితుల మనోనిబ్బరానికీ, సాహసానికీ నివాళులు

Posted On: 14 AUG 2025 8:52AM by PIB Hyderabad

దేశవిభజనభయ విహ్వలత సంస్మరణ దినాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాటించారుభారతదేశ చరిత్రలో అత్యంత విషాదభరిత అధ్యాయాల్లో ఒకటైన విభ‌జ‌న కాలంలోఎంతో మంది ప్రజలు ఎదుర్కొన్న కష్టనష్టాలనుపడ్డ వేదనను ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు.

విభజన కాలంలో ఇబ్బందులు పడిన వారు చాటిన మనోనిబ్బరానికీవారి ధీరత్వానికీ ప్రధానమంత్రి హృదయపూర్వకంగా నివాళులు అర్పించారువారు ఊహించలేనన్ని కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచారనీమళ్లీ కొత్త జీవితాల్ని నిర్మించుకోగలిగారనీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘దేశవిభజనభయ విహ్వలత సంస్మరణ దినాన్ని (#PartitionHorrorsRemembranceDay) పాటిస్తోంది భారత్మన దేశ చరిత్రలో దుఖ్ఖభరిత అధ్యాయమైన ఆ కాలంలో ఎంతో మంది ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులనూపడ్డ వేదననూ దేశం స్మరించుకుంటోందిఇది వారి ధైర్యసాహసాలను గౌరవించే రోజు.. ఊహకు అందనన్ని కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచితమ జీవన యాత్రను మళ్లీ సరికొత్తగా మొదలుపెట్టే శక్తిని కూడదీసుకున్నారుఆనాటి బాధితుల్లో చాలా మంది తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవడంతోపాటు అసాధారణ విజయాలనూ సాధించారుమన దేశాన్ని ఏకతాటి మీద నిలబెడుతున్న సద్భావన బంధాల్ని సదా బలపరుస్తూ ఉండాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని కూడా ఈ రోజు మనకు గుర్తు చేస్తోంది.’’  ‌

 

***


(Release ID: 2156301)