హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమం... న్యూఢిల్లీలోని తన నివాసంలో మువ్వన్నెల జెండాను ఎగరేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


• ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమం ప్రస్తుతం ప్రజా ఉద్యమంగా మారింది.. దేశభక్తి భావనను బలపరచడంతో పాటు దేశాన్ని ఏకతా బంధంలో పెనవేస్తున్న ఉద్యమం...

• ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ త్యాగం, తపస్సు, అంకిత భావాలతో స్వతంత్ర భారతావని కలను నిజం చేశారని చాటుతున్న ప్రచార ఉద్యమమిది.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగాను, అత్యుత్తమ దేశంగాను తీర్చిదిద్దాలన్నదే 140 కోట్ల మంది దేశవాసుల దృఢసంకల్పం

Posted On: 13 AUG 2025 11:08AM by PIB Hyderabad

హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమంలో భాగంగా కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 

image.png

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇచ్చిన ఒక సందేశంలో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు.. ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో మొదలుపెట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార  ఉద్యమం ఇవాళ ఒక ప్రజా ఉద్యమంగా మారిపోయిందిదేశభక్తి భావనను బలపరచడంతో పాటుదేశప్రజలనందరినీ ఏకతాబంధంలో పెనవేయడానికి ఉద్దేశించిన ఉద్యమమిదిత్యాగంతపస్సుఅంకిత భావాలతో ఎందరో స్వాతంత్ర్య  సమర యోధులు స్వతంత్ర భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న కలను నిజం చేశారుఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగానుఅత్యుత్తమ దేశంగాను తీర్చిదిద్దాలని 140 కోట్ల మంది భారతీయులు దృఢ సంకల్పంతో ఉన్నారు.’’

 

***


(Release ID: 2155948)