ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నమీబియా జాతిపిత.. తొలి అధ్యక్షుడు డాక్టర్ సామ్ నుజోమాకు హీరోస్ ఎకర్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 JUL 2025 7:42PM by PIB Hyderabad

నమీబియా జాతిపిత.. ఆ దేశ తొలి అధ్యక్షుడు డాక్టర్ సామ్ నుజోమాకు హీరోస్ ఎకర్ స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

నమీబియా స్వాతంత్య్ర పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనిక నాయకుడిగా డాక్టర్ సామ్ నుజోమా సేవలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారుస్వతంత్ర నమీబియా తొలి అధ్యక్షునిగా డాక్టర్ నుజోమా జాతి నిర్మాణం కోసం స్ఫూర్తిదాయకమైన కృషి చేశారుఆయన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.

డాక్టర్ సామ్ నుజోమా భారతదేశానికి ఆత్మీయ మిత్రులు. 1986లో న్యూఢిల్లీలో మొట్టమొదటి డిప్లొమాటిక్ మిషన్ ఆఫ్ నమీబియా [నాటి ఎస్‌డబ్ల్యూఏపీవోఏర్పాటులో ఆయన భాగస్వామ్యాన్ని భారత ప్రజలు సదా గౌరవిస్తారు.. ప్రేమగా గుర్తుంచుకుంటారు.

 

***


(रिलीज़ आईडी: 2143589) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam