ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి


ప్రజాస్వామ్యాన్ని గౌరవించే స్నేహపూర్వక దేశానికి ఎన్నికైన ప్రతినిధుల ముందుకు రావటం నాకు ఎంతో గౌరవంగా ఉంది: ప్రధానమంత్రి

భారతదేశానికి ప్రజాస్వామ్యం అనేది ఒక జీవన విధానం: ప్రధానమంత్రి

శతాబ్దాల నాటి సంబంధాలలో లోతుగా పాతుకుపోయిన స్నేహ బంధాన్ని ఇరు దేశాలు కలిగి ఉన్నాయి: ప్రధానమంత్రి

ఆధునిక భారత్‌ను నిర్మించేదిశగా మహిళలకు శక్తి సామర్థ్యాలను అందిస్తున్నాం: ప్రధానమంత్రి

మేం అభివృద్ధిని ఇతరుల పట్ల బాధ్యతగా భావిస్తున్నాం. ఎల్లప్పుడూ గ్లోబల్ సౌత్‌ మా ప్రాధ్యనత: ప్రధానమంత్రి

గ్లోబల్ సౌత్ వృద్ధి చెందుతోంది... నూతన, సమన్యయంతో కూడిన ప్రపంచ క్రమాన్ని ఇది చూడాలనుకుంటోంది: ప్రధానమంత్రి

గ్లోబల్ సౌత్‌కు కోసం భారతదేశ దార్శనికత… మహాసాగర్: ప్రధానమంత్రి

Posted On: 04 JUL 2025 10:51PM by PIB Hyderabad

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుసెనేట్ అధ్యక్షులు వాడే మార్క్దిగువ సభ స్పీకర్ జగదేవ్ సింగ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన.. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారుభారతదేశంట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక కీలక కార్యక్రమంగా నిలిచిపోతుంది.

ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ తరఫున సభలో ఉన్న ప్రతినిధులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారుఅత్యున్నత జాతీయ గౌరవాన్ని తనకు అందించినందుకు ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారుభారత ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని వివరిస్తూ దేశాన్ని ప్రజాస్వామ్య మాతగా పేర్కొన్నారుదేశ సంస్కృతిజీవనంలో ప్రజాస్వామ్యం అంతర్భాగంగా ఉందని అన్నారుభారతదేశ వైవిధ్యం సుసంపన్నంగా మారేందుకుఅన్ని ఆలోచనలు సహజీవనం చేస్తూ కొనసాగేలా ఇది ఉపయోగపడిందని వివరించారుఅంతేకాకుండా పార్లమెంటరీ ప్రక్రియలుబహిరంగ చర్చలను పెంపొందించాయని అన్నారు

ప్రజాస్వామ్యంతో విజయవంతంగా సాగిస్తోన్న ప్రయాణం పట్ల ఆ దేశానికి అభినందనలు తెలియజేశారుస్వేచ్ఛా మార్గంలో ఆ దేశ ప్రజలతో సంఘీభావంగా నిలబడటం భారత్‌కు దక్కిన అదృష్టమని ఆయన పేర్కొన్నారుఆధునిక దేశాలుగా ఇరు దేశాల మధ్య లోతుగా పాతుకుపోయిన బంధాలు మరింత బలపడుతున్నాయని ఆయన ప్రధానంగా చెప్పారుభారతదేశం బహుమతిగా ఇచ్చిన స్పీకర్ కుర్చీలో ఇవి ప్రతిబింబిస్తున్నాయన్న ఆయన.. ద్వైపాక్షిక పార్లమెంటరీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి పిలుపునిచ్చారుసభలో మహిళల భాగస్వామ్యం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన భారత పార్లమెంటురాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారుదేశంలో చిట్టచివరి స్థాయిలో నాయకత్వం వహిస్తున్న మహిళా నాయకుల గురించి కూడా ఆయన వివరించారుస్థానిక స్వపరిపాలన సంస్థలకు ప్రాతనిధ్యం వహిస్తోన్న1.5 మిలియన్ల మహిళల గురించి ప్రస్తావించారు

మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రధానమంత్రి వివరించారుశాంతిని కోరుకునే వారికి తీవ్ర ముప్పుగా మారిన ఉగ్రవాదంపై పోరాటాన్ని బలోపేతం చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారుప్రపంచ స్థాయి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలనిగ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యత అందాల్సిన అవసరం ఉందని అన్నారుభారతదేశంకరీబియన్ సమాజం (క్యారీకోమ్మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ట్రినిడాడ్‌లో భారతీయుల రాకకు 180 సంవత్సరాలు నిండిన సందర్భంగా జరుగుతున్న వేడుకలను గుర్తు చేసిన ఆయన.. రెండు దేశాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటి సంబంధాలపై ఆధారపడి ఉన్నాయన్నారుఇవి మరింతగా వృద్ధి చెందుతూనే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు

 

 

 

***

MJPS/ST


(Release ID: 2142471) Visitor Counter : 3