ప్రధాన మంత్రి కార్యాలయం
ట్రినిడాడ్ టొబాగోలో ఆధికారిక పర్యటనకు గాను పోర్ట్ ఆఫ్ స్పెయన్‌కు చేరుకొన్న ప్రధానమంత్రి
Posted On:
04 JUL 2025 4:14AM by PIB Hyderabad
ట్రినిడాడ్ టొబాగోలో గురు, శుక్రవారాల్లో.. అంటే 2025 జులై 3, 4 తేదీల్లో.. ఆధికారిక పర్యటన కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు చేరుకొన్నారు. 1999 తరువాత, భారతదేశ ప్రధానమంత్రి ఒకరు ట్రినిడాడ్ టొబాగోలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య ఉన్న లాంఛనపూర్వక, సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని శ్రీ నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా స్వయంగా స్వాగతం పలికారు. ఆమెతో పాటు మంత్రిమండలి సభ్యులు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రికి సంప్రదాయబద్ధ గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
అనంతరం హోటల్‌కు చేరుకున్న ప్రధానమంత్రికి ట్రినిడాడ్ టొబాగోలోని ప్రవాస భారతీయులు క్యాబినెట్ మంత్రుల సమక్షంలో ఘనంగా స్వాగతం పలికారు.
***
(Release ID: 2142199)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam