ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌‌లో క్రీడా మౌలిక సదుపాయాలు గత 11 ఏళ్లలో విస్తరించడాన్ని ప్రధానంగా ప్రస్తావించిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 JUN 2025 12:41PM by PIB Hyderabad

గత 11 సంవత్సరాల్లో మన దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు విస్తరించిన పరిణామాలను ప్రధానంగా ప్రస్తావించిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు. ఈ మార్పు ప్రపంచంలో క్రీడారంగంలో ఇండియా అగ్రగణ్య దేశంగా ఎదిగేందుకు తోడ్పడగలదని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘దేశంలో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు గత 11 సంవత్సరాల్లో ఇదివరకెన్నడూ ఎరుగని విధంగా ఎలా విస్తరించిందీ కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ (@mansukhmandviya) ప్రధానంగా చెప్పారు. యువతకు పెద్దపీట వేస్తూ చోటుచేసుకుంటున్న ఈ మార్పు ప్రపంచంలో క్రీడారంగంలో అగ్రగామిగా భారత్‌ దూసుకుపోవడంలో తోడ్పడుతోంది’’ అని పేర్కొన్నారు.‌  


(रिलीज़ आईडी: 2135405) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam