పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
32 విమానాశ్రయాలు, విమాన మార్గాలలో పౌర విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత
Posted On:
10 MAY 2025 12:47AM by PIB Hyderabad
నిర్వహణ కారణాల వల్ల 2025 మే 9 నుంచి 14 (2025 మే 15, 05:29 భారత కాలమానం) వరకు అమల్లోకి వచ్చే అన్ని పౌర విమాన కార్యకలాపాల కోసం ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలలో పౌర విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఎఎఐ), సంబంధిత విమానయాన సంస్థలు వరుస నోటీసులు (నోటామ్) జారీ చేశాయి. వీటిలో ఈ కింది పేర్కొన్న విమానాశ్రయాలు ఉన్నాయి.
-
అధంపూర్
-
అంబాలా
-
అమృత్‌సర్
-
అవంతిపూర్
-
భటిండా
-
భుజ్
-
బికనేర్
-
చండీగఢ్
-
హల్వారా
-
హిండన్
-
జైసల్మేర్
-
జమ్మూ
-
జామ్‌నగర్
-
జోధ్‌పూర్
-
కాండ్లా
-
కాంగ్రా (గగ్గల్)
-
కేశోడ్
-
కిషన్‌గఢ్
-
కుల్లు మనాలి (భుంటార్)
-
లేహ్
-
లుధియానా
-
ముండ్రా
-
నళియా
-
పఠాన్ కోట్
-
పాటియాలా
-
పోర్‌బందర్
-
రాజ్‌కోట్ (హిరాసర్)
-
సర్సావా
-
సిమ్లా
-
శ్రీనగర్
-
థోయిస్
-
ఉత్తర్లై
పైన పేర్కొన్న విమానాశ్రయాల్లో అన్ని పౌర విమాన కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి.
అదేవిధంగా నిర్వహణ కారణాల వల్ల ఢిల్లీ, ముంబయి ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్ (ఎఫ్ఐఆర్)లో ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ఏటీఎస్) మార్గాల్లోని 25 విభాగాల తాత్కాలిక మూసివేత గడువును పొడిగిస్తున్నట్టు కూడా భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ప్రకటించింది.
నోటం G0555/25 (దీనిని G0525/25 కు ప్రత్యామ్నాయంగా విడుదల చేశారు) ప్రకారం, 25 ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ఏటీస్) రూట్ విభాగాలు భూమి స్థాయి నుంచి అపరిమిత ఎత్తు వరకు 14 మే 2025 రాత్రి 23:59 యూటీసి వరకు (భారత కాలమానం ప్రకారం మే 15, 2025 ఉదయం 05:29 వరకు) అందుబాటులో ఉండవు.
ప్రస్తుతం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ ఆదేశాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని విమానయాన సంస్థలు, విమానాల నిర్వాహకులకు సలహా ఇచ్చారు. ఈ తాత్కాలిక నిలుపుదలను సంబంధిత విమాన నియంత్రణ కేంద్రాల (ఏ టీ సీ విభాగాలు) సమన్వయంతో అమలు చేస్తున్నారు. తద్వారా భద్రతతో పాటు అంతరాయాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
***
(Release ID: 2128056)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam