సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత్ పెవిలియన్: కళ నుంచి కోడ్ వరకు – వేవ్స్ 2025లో అద్భుత స్పందన
Posted On:
04 MAY 2025 5:10PM
|
Location:
PIB Hyderabad
దేశంలోని విభిన్నమైన కథలు చెప్పే సంప్రదాయాల్లో లీనమయ్యే అనుభవాన్ని అందించిన భారత్ పెవిలియన్‌కు వేవ్స్ 2025 సందర్శకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘కళ నుంచి కోడ్ వరకు’ అనే ఇతివృత్తంతో ఈ పెవిలియన్ ఏర్పాటైంది. ఇది మౌఖిక, ప్రదర్శన సంప్రదాయాల నుంచి అత్యాధునిక డిజిటల్ ఆవిష్కరణల వరకు మీడియా, వినోద రంగంలో భారత్ పరిణామ క్రమాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే అవకాశాన్ని సందర్శకులకు అందించింది.
భారత్ పెవిలియన్, ఓ వైపు దేశ ఆత్మను ప్రతిబింబిస్తూనే మరో వైపు మన సాంస్కృతిక వారసత్వాన్ని, అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలతో సమతౌల్యం చేసింది. వేవ్స్ 2025ను ప్రారంభించిన రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ పెవిలియన్‌ను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తదితర ప్రముఖులు ఈ పెవిలియన్‌ను సందర్శించి, మన దేశగాథను చెప్పడంలో ఈ వేదిక పోషించిన పాత్రను ప్రశంసించారు. ఈ పెవిలియన్‌ను పెద్ద సంఖ్యలో సందర్శించిన ప్రేక్షకులు.. మన దేశానికి చెందిన అనేక కళల గురించి తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యారు.
దేశ సృజనాత్మక ప్రయాణాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్ కేవలం విషయ ప్రదర్శనకే పరిమితం కాలేదు. క్రియేటర్‌గా భారత్ శక్తిని ప్రదర్శించింది. ఇది భారతీయ సాంస్కృతిక నేపథ్యాన్ని, కళాత్మక నైపుణ్యాన్ని, అంతర్జాతీయంగా కథ చెప్పే కళలో దేశ సామర్థ్యాన్ని తెలియజేసింది. ఈ పెవిలియన్‌ను నాలుగు అంశాలుగా విభజించారు. ప్రతి విభాగం భారతీయ సృజనాత్మక వారసత్వాన్ని భిన్నమైన కోణాల్లో ప్రదర్శించింది.
శ్రుతి – మౌఖిక సంప్రదాయాలు: భారతీయ పురాతన కథన వారసత్వాన్ని గౌరవిస్తూ ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్, పురాతన సాహిత్యాన్ని లయ, తాళం ఎలా సంరక్షించాయో వివరించింది.
ప్రత్యేక ఆకర్షణలు:
-
గురు-శిష్య పరంపర: మౌఖిక విజ్ఞాన వ్యవస్థలకు వందనం.
-
మార్మిక పలుకులు: వేద మంత్రాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు.
-
ధున్-మ్యూజియం: భారతీయ సంప్రదాయ సంగీత సాధనాల ప్రదర్శన
-
నేల పాటలు: జానపద సంగీత ప్రదర్శన.
-
సంగీత తరంగాలు: గౌహర్ జాన్ నుంచి అంతర్జాతీయ సంగీత విద్వాంసుల వరకు.
-
స్పాటిఫై వేదిక: అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, ఇతర యువ సంగీత కళాకారుల ప్రత్యక్ష కచేరీలు.
-
భారత ఆకాశ తరంగాలు: ఆల్ ఇండియా రేడియో విశిష్టత.
-
కోకిల గానాలు: వందేళ్ల నేపథ్య గాన ప్రతిష్ఠ.
-
క్యాసెట్ నుంచి క్లవుడ్: సంగీత పద్ధతుల్లో వచ్చిన మార్పులు.
-
పాడ్క్యాస్ట్ సెంట్రల్: పెరుగుతున్న ఆడియో సంస్కృతి.
-
జ్ఞాన తరంగాలు: భారత్‌లో విస్తరిస్తున్న ఆడియో బుక్స్.
కృతి- శాసనాలు, రచనల సంప్రదాయం: భారతీయ నాగరికతకు సంబంధించిన అంశాల పరిరక్షణలో రచనల ప్రాధాన్యాన్ని ఈ విభాగం తెలియజేస్తుంది.
ప్రత్యేక ఆకర్షణలు:
-
తొలి అడుగులు: ఆదిమానవుల గుహా చిత్రాలు, సమాచారం.
-
సింధు మూలాలు: సింధు లోయ నాగరికతను తెలుసుకొనేందుకు ఇంటరాక్టివ్ అనుభవం.
-
తరతరాల రామాయణం: ఆసియా ఖండంలో ఇతిహాస ప్రభావం.
-
అలనాటి శాసనాలు: అశోకుని శాసనాలు.
-
జ్ఞాన భాండాగారం: పురాతన గ్రంథాలయాలకు చెందిన రాత ప్రతులు.
మెమోయర్స్ ఆఫ్ మెటల్: రాగిరేకుల మీద రచనలు
ది పవర్ ఆఫ్ ప్రింట్: భారత్‌లో పత్రికల విస్తరణ.
-
పుస్తకాల వరుస: ప్రతిష్ఠాత్మక పుస్తకాల డిజిటల్ లైబ్రరీ.
-
ముఖపత్ర కథనాలు: భారతీయ మ్యాగజైన్ల ప్రదర్శన.
-
ది కామిక్స్ కార్నర్: ప్రజాదరణ పొందిన కామిక్స్ నుంచి గ్రాఫిక్ నవలల వరకు.
దృష్టి – దృశ్య సంప్రదాయాలు:
గుహల్లో చిత్రాల దగ్గర నుంచి ఆధునిక సినిమాల వరకు దృశ్యమాధ్యమంలో కథ చెప్పే కళపై ఈ విభాగం దృష్టి సారించింది.
ప్రత్యేక ఆకర్షణలు:
-
కళాయాత్ర: దేశంలో దృశ్య మాధ్యమ కళలో వచ్చిన మార్పులను ప్రదర్శించిన ఎల్ఈడీ సొరంగం.
-
అలనాటి లయ: హరప్పా నాగరికతకు చెందిన నర్తకీమణి హాలోగ్రాఫిక్ నృత్య ప్రదర్శన.
-
భావోద్వేగాల పంట: నవరసాల అన్వేషణ.
-
నటరాజు నాట్యం: నటరాజు శివునికి దృశ్య నీరాజనం.
-
జనపదాలు: జానపద నృత్యాలు, తోలుబొమ్మలాటలు, గిరిజన నృత్యాలు.
-
కాలం చెక్కిన కిటికీలు: చలనచిత్ర పరిణామంపై ప్రదర్శన.
-
ఆరాధ్యులు: భారతీయ సినీ దిగ్గజాలకు గౌరవం.
-
తెర వెనుక నైపుణ్యాలు: చలన చిత్ర దర్శకులు, సాంకేతిక నిపుణులకు నివాళి.
-
కాలక్రమంలో టీవీక్షణం: దూరదర్శన్ నుంచి స్ట్రీమింగ్ యాప్‌ల వరకు వచ్చిన మార్పులు.
క్రియేటర్స్ లీప్:
భవిష్యత్తు కథన సాంకేతికల్లో భారత్ ఆవిష్కరణలను ఈ విభాగం ప్రదర్శిస్తుంది.
ప్రత్యేక ఆకర్షణలు:
-
ఏఐ, ఎక్స్ ఆర్, గేమింగ్, మెటావర్స్, యానిమేషన్లో భారత్ సాధించిన వృద్ధి ప్రదర్శన.
-
విస్తరిస్తున్న భారతీయ మేధో హక్కుల ప్రదర్శన
-
స్టోరీటెల్లింగ్ భవిష్యత్తును వివరించే ప్రదర్శనలు
వేవ్స్ 2025లో దేశంలో కథ చెప్పే సంప్రదాయాలు, ఆవిష్కరణలకు సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించే వేదికగా భారత్ పెవిలియన్ నిలిచింది. సంప్రదాయాలను పరిరక్షిస్తూనే భవిష్యత్తు దిశగా నడుస్తున్న సృజనాత్మక శక్తి కేంద్రంగా భారత్ గుర్తింపును తెలియజేసింది.
మరింత సమాచారం కోసం అనుసరించాల్సిన అధికారిక ఖాతాలు:
Release ID:
(Release ID: 2127078)
| Visitor Counter:
14
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam