@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ముంబయిలో వేవ్స్‌పై సమీక్ష సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్. మురుగన్ అధ్యక్షత; సదస్సు వేదిక వద్ద సన్నాహాల పరిశీలన

 Posted On: 18 APR 2025 4:19PM |   Location: PIB Hyderabad

ప్రపంచ దృశ్యశ్రవణ వినోద సదస్సు (వేవ్స్)-2025కు సంబంధించి ముంబయిలో నేడు జరిగిన సమీక్ష సమావేశానికి కేంద్ర సమాచారప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్మురుగన్ అధ్యక్షత వహించారుజియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమీక్ష సమావేశం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్రంమహారాష్ట్ర ప్రభుత్వాల నోడల్ అధికారులు పాల్గొన్నారువేవ్స్ కు ప్రధాన ప్రాతిపదికలైన సమాచార ప్రసారంటీవీ కార్యక్రమాలుఏవీసీజీఎక్స్ఆర్డిజిటల్ మీడియాఆవిష్కరణసినిమాలు అనే అంశాల్లో పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారువేవ్స్ బజార్వేవెక్స్భారత్ పెవిలియన్క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజితోపాటు వివిధ ఇతర కార్యక్రమాల కింద చేపట్టిన పనుల వివరాలను చర్చించారుఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారువివిధ విభాగాలకు చెందిన నోడల్ అధికారులు సన్నాహాల పురోగతి గురించి మంత్రికి వివరించారుఈ సందర్భంగా సదస్సు వేదిక వద్ద కార్యక్రమ ఏర్పాట్లను కూడా శ్రీ ఎల్మురుగన్ పరిశీలించారు.

వేవ్స్ గురించి

మీడియా, వినోద రంగాల్లో కీలకమైన కార్యక్రమం తొలి ప్రపంచ దృశ్యశ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను ముంబయిలో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుందిమీరు సంబంధిత రంగంలో నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలైనా... అనుసంధానం, భాగస్వామ్యం, ఆవిష్కరణలతో మీడియావినోద రంగంలో ప్రతిభను చాటుకునేందుకు అత్యున్నత అంతర్జాతీయ వేదికగా ఈ సదస్సు నిలుస్తుంది.

భారతీయ సృజన శక్తిని వేవ్స్ విస్తృతంగా చాటబోతోంది. కంటెంట్ సృజనమేధో సంపత్తిసాంకేతిక ఆవిష్కరణల నిలయంగా దేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేయనున్నదిసమాచార ప్రసారంముద్రణ మాధ్యమాలుటీవీ, రేడియోసినిమాయానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్సంగీతంప్రకటనలుడిజిటల్ మీడియాసోషల్ మీడియా వేదికలుఉత్పాదక కృత్రిమ మేధఅగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్వంటి పరిశ్రమలురంగాలపై దృష్టి సారించారు.

ఇంకా సందేహాలున్నాయా? జవాబుల కోసం ఇక్కడ చూడండి.

వేవ్స్ పీఐబీ బృందం ఎప్పటికప్పుడు అందించే తాజా ప్రకటనలను చదవండి.

రండిమాతో కలసి  ప్రయాణించండిఇప్పుడే  వేవ్స్ కు రిజిస్టర్ చేసుకోండి

 

***


Release ID: (Release ID: 2122816)   |   Visitor Counter: 45