ప్రధాన మంత్రి కార్యాలయం
యునెస్కో ప్రపంచ స్మారకాల రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రాలను చేర్చడంపై ప్రధాని హర్షం
प्रविष्टि तिथि:
18 APR 2025 10:43AM by PIB Hyderabad
యునెస్కో ప్రపంచ స్మారకాల రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రాలను చేర్చడమన్నది మన కాలాతీత జ్ఞానం, సుసంపన్నమైన సంస్కృతికి దక్కిన ప్రపంచవ్యాప్త గుర్తింపుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన పోస్టుకు స్పందనగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడికీ గర్వకారణమైన క్షణం!
యునెస్కో ప్రపంచ స్మారకాల రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రాలను చేర్చడమన్నది మన కాలాతీత జ్ఞానం, సుసంపన్నమైన సంస్కృతికి దక్కిన ప్రపంచవ్యాప్త గుర్తింపు.
గీత, నాట్యశాస్త్రం నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి అందించిన సందేశం శతాబ్దాలుగా ప్రపంచానికి స్ఫూర్తినిస్తోంది.
@UNESCO”
(रिलीज़ आईडी: 2122809)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada