ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వాషింగ్టన్ డీసీలో దుర్ఘటన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 31 JAN 2025 9:09AM by PIB Hyderabad

వాషింగ్టన్ డీసీలో జరిగిన దుర్ఘటన ప్రాణ నష్టానికి దారి తీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు కూడా శ్రీ మోదీ సంతాపం తెలిపారు. ఈ శోక సమయంలో అమెరికా ప్రజలకు బాసటగా నిలుస్తామని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశంలో -
‘‘వాషింగ్టన్ డీసీలో జరిగిన దు:ఖ దాయక దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధపడ్డాను.
బాధితుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం.
ఈ శోక సమయంలో మేం అమెరికా ప్రజలకు బాసటగా ఉంటాం. @realDonaldTrump” అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/ST


(Release ID: 2106344) Visitor Counter : 5