మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చా 2025’ ఒకటో ఎపిసోడ్‌ ‘పరీక్షా పే చర్చా 2025’ రెండో ఎపిసోడ్‌లో దీపిక పదుకోన్

Posted On: 12 FEB 2025 7:35PM by PIB Hyderabad

పరీక్షా పే చర్చా (పీపీసీఎనిమిదో సంచికలో భాగంగా 2025 ఫిబ్రవరి 10 న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో నిర్వహించిన ఒకటో ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విద్యార్థులతో మాట్లాడారుఅనధికార కార్యక్రమమే అయినా లోతైన అవగాహ ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో... దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులతో ప్రధాని సమావేశమయ్యారువారితో అనేక అంశాల్ని ఆయన చర్చించారు36 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారువారు పోషణ సంబంధిత విజ్ఞ‌ానం-వెల్‌నెస్ఒత్తిడిని జయించడంతమతో తామే పోటీ పడుతూ ఉండటంనాయకత్వకళపుస్తకాల్లో ఉన్న జ్ఞ‌ానాన్ని గ్రహించడమే కాకుండా వ్యక్తిగతంగా అనేక అంశాల్లో పట్టు సాధించడంప్రతిదాన్లో సానుకూల కోణాన్ని చూడటంతోపాటు మరెన్నో విషయాల్లో విలువైన అంశాల్నిప్రధాని మార్గదర్శకత్వంలోనేర్చుకొన్నారువిద్యార్జన ప్రక్రియలో విద్యార్థులకు తలెత్తే సవాళ్లను వారు ఆత్మవిశ్వాసంతోనూజీవనంలో ఎదగాలనే మనస్తత్వంతోనూ ఎదుర్కొనిధైర్యంగా ముందడుగు వేయడానికి అవలంబించాల్సిన సాధ్య వ్యూహాల్నీగొప్పవైన ఆలోచనల్నీ ఈ ముఖాముఖి కార్యక్రమం వారికి అందించింది.

ఈ రోజుపరీక్షా పే చర్చా (పీపీసీఎనిమిదో సంచికలో భాగంగా నిర్వహించిన రెండో ఎపిసోడ్‌లో ప్రముఖ నటిమానసిక ఆరోగ్య కార్యకర్త దీపిక దుకోన్ పాలుపంచుకున్నారుఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మానసికంగా ఎదురయ్యే సవాళ్ల నుంచి బయటపడే క్రమంలో మనం పాఠాల్ని ఎలా నేర్చుకోవచ్చో దీపిక తెలిపారుతాను స్వీయానుభవాల నుంచే గొప్ప పాఠాల్ని నేర్చుకున్నట్లు చెప్పారు. ఒత్తిడిని తాను ఎలా అధిగమించవచ్చో వెల్లడించారుబాగా నిద్రపోవడంఆరుబయట ఎండలో సమయాన్ని గడపడం,  తాజా గాలిని పీల్చడంప్రతి నిత్యం ఆరోగ్యకరమైన చర్యల్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తూ ఉండడం వల్ల ఒత్తిడిని తట్టుకోవచ్చని ఆమె అన్నారుమన మీద మనకు విశ్వాసం ఉండటంసానుకూల మనస్తత్వాన్ని అలవర్చుకోవడం విజయ సాధనలో కీలక అంశాలని ఆమె స్పష్టం చేశారుఓటముల్ని పాఠాలు నేర్పే అవకాశాలుగా భావించాలంటూ విద్యార్థులకు ప్రోత్సాహాన్నందించారుదృఢనిశ్చయంతో ముందుకు సాగిపోవాలంటూ ఆమె వారిలో స్ఫూర్తిని నింపారు.

‘‘మీ అభిప్రాయాల్ని బయటకు చెప్పండి... వాటిని ఎన్నటికీ అణచుకోవద్దు’’.. అని పదేపదే చెబుతూ ఉండే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సందేశాన్ని దీపిక పదుకోన్ ఈ కార్యక్రమంలో పునరుద్ఘాటించారుఅవసరమైనప్పుడు సాయం కోరాల్సిందేనని ఆమె స్పష్టం చేశారువిద్యార్థులు వారి బలాల్నీ, బలహీనతల్నీ- కాగితం ముక్కల మీద రాసిఒక బోర్డు మీద గుచ్చి ఉంచారువాటి ఆధారంగా విద్యార్థులను దీపిక కొన్ని ప్రశ్నలడిగిసమాధానాలు రాబట్టారుస్వీయ అవగాహనను కలిగి ఉండటంతోపాటు వారిలోని అనుకూలాంశాల్ని గుర్తించడం ప్రధానమన్న అంశాన్ని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. 54321 గా వ్యవహరించే ఒక కసరత్తును చేయించి పరీక్షల వేళ ఏకాగ్రతకు పదును పెట్టుకోవడానికో చిట్కాను విద్యార్థులకు దీపిక వెల్లడించారు.

విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు దీపిక పాదుకోణ్ తన స్వీయ అనుభవాల ఆధారంగా జవాబులిచ్చారుఆమె ఇచ్చిన సమాధానాలు ఆచరణీయంగానే కాక ఎంతో విలువైనవిగా ఉన్నాయి అంతర్జాతీయ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థి ఒకరికి ప్రశ్న వేసే అవకాశం దక్కిందిఇది చర్చకు విశాల దృక్పథాన్ని జోడించిజిజ్ఞ‌ాసను పెంచింది.

పీపీసీ ఎనిమిదో సంచిక ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందిఏడాదికోసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కోట్ల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటుండడంతో ఇది ఒక ప్రజా ఉద్యమం స్థాయికి ఎదిగిందనవచ్చువిషయాల్ని నేర్చుకోవడాన్ని సామూహిక ఉత్సవంలా మార్చి ఈ కార్యక్రమం ప్రేరణనందిస్తోందిప్రధానితో సాగిన ఎపిసోడ్‌‌లో పాల్గొనే 36 మంది విద్యార్థుల్ని అన్ని రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపిక చేశారువారిలో రాష్ట్రకేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులుకేంద్రీయ విద్యాలయసైనిక్ స్కూల్ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలసీబీఎస్ఈనవోదయ విద్యాలయాల విద్యార్థులున్నారుఈ సంవత్సరంలో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో లోతైన అవగాహన కలిగించే మరో ఆరు ఎపిసోడ్‌లు కూడా ఉంటాయిఈ ఎపిసోడ్‌లలో వివిధ రంగాల ప్రముఖులు భాగం పంచుకొనిజీవనంతోపాటు జ్ఞ‌ానార్జనకు సంబంధించిన అత్యవసర అంశాల్లో విద్యార్థులకు మార్గదర్శులుగా వ్యవహరించనున్నారుప్రతి ఎపిసోడ్‌లో ముఖ్య ఇతివృత్తాల్ని చర్చిస్తున్నారు:

అదనపు సమాచారం కోసం :

Link to watch the 1st episode: https://www.youtube.com/watch?v=G5UhdwmEEls

Link to watch the 2nd episode: https://www.youtube.com/watch?v=DrW4c_ttmew

 

***


(Release ID: 2102697) Visitor Counter : 23