ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిబ్రవరి 12న మానసిక ఆరోగ్యంపై ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం: ప్రధానమంత్రి
Posted On:
11 FEB 2025 1:32PM by PIB Hyderabad
మానసిక, దైహిక ఆరోగ్యం గురించి చర్చించేందుకు ‘ఎక్జామ్ వారియర్లు’ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
“అందువల్ల, ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ అంశానికే కేటాయించాం. ఇది ఫిబ్రవరి 12న ప్రసారమవుతుంది” అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పై ప్రధాని ఇలా పోస్టు చేశారు:
“#ExamWarriors లో సాధారణంగా చాలామంది చర్చించాలని కోరుకునే అంశం మానసిక ఆరోగ్యం. అందుచేత ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ఈ అంశంపై ఒక ప్రత్యేక ఎపిసోడ్ ని సిద్ధం చేశాం. ఇది రేపు, అంటే ఫిబ్రవరి 12న ప్రసారమవుతుంది. ఈ అంశం పట్ల ఎంతో ఆసక్తి చూపే @deepikapadukone ఈ కార్యక్రమంలో భాగమై ప్రసంగిస్తారు” అని పేర్కొన్నారు.
***
MJPS/VJ/SKS
(Release ID: 2101806)
Visitor Counter : 34
Read this release in:
Malayalam
,
Assamese
,
Nepali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada